Nallapareddy Prasanna: నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసుల నోటీసులు..
ABN , Publish Date - Jul 22 , 2025 | 09:46 AM
మాకు భయమంటే ఏంటో తెలీదంటూ బీరాలు పోయిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు.
నెల్లూరు: మాకు భయమంటే ఏంటో తెలీదంటూ బీరాలు పోయిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. టీడీపీ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యేకు కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకి హాజరు కావాల్సిందిగా SI రంగనాథ్ గౌడ్ నోటీసులు పేర్కొన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. మహిళా ఎమ్మెల్యేపై అసభ్యకర పదజాలంతో ప్రసన్నరెడ్డి ఆరోపణలు చేయడంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది.

ఇవీ చదవండి..
సైట్ క్లియరెన్స్ కోసం ఏపీ దరఖాస్తు
ఏపీ, తెలంగాణలో తలసరి ఆదాయాల పెరుగుదల
For Telugu and Latest News