Share News

Kollu Ravindra: బందరు - రేపల్లె రైల్వే లైన్ సాధిస్తాం

ABN , Publish Date - Jun 08 , 2025 | 10:04 PM

మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్‌లో జన సంద్రం ఊహించనిదని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

Kollu Ravindra: బందరు - రేపల్లె రైల్వే లైన్ సాధిస్తాం

మచిలీపట్నం, జూన్ 08: వచ్చే ఏడాది జూన్ నుంచి బందరు పోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని గనులు, భూగర్బం, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆదివారం మసూల బీచ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్య ప్రసాద్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. 2014లో కొత్తగా ఎమ్మెల్యే అయిన తరువాత బందరు అభివృద్ధికి ఏం చేయాలి అని ఆలోచించానన్నారు. టూరిజం పెరిగితే ఆ రాష్ట్ర జిడిపి పెరుగుతుందని చెప్పారు. కొన్ని దేశాలు టూరిజంపై ఆధారపడి ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 2026 జూన్ తరువాత పోర్టు నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు.

Kollu-01.jpg


పల్లె తుమ్మలపాలెం వద్ద 7 వేల ఎకరాలు భూమి ఉందని.. అక్కడ క్రిటికల్ మినరల్ ప్లాంట్‌ను తీసుకువస్తామని చెప్పారు. తనపై అక్రమ కేసు పెట్టి 54 రోజులు రాజమండ్రి జైలులో పెట్టారని వివరించారు. ఆ సమయంలో బాధపడ్డానని.. నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన0 గుర్తు చేసుకున్నారు. నాకు బందరు ప్రజలు పునర్జన్మ ఇచ్చారని.. ఆ రుణం తీర్చుకోవాలని స్పష్టం చేశారు. నా చివర రక్తపు బొట్టు వరకు బందరు అభివృద్ధికి కృషి చేస్తానని బందరు నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. బందరు, రేపల్లె రైల్వే లైన్ సాధిస్తానని ఆయన ప్రకటించారు.

Kollu-02.jpg


ఇక రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్‌లో జన సంద్రం ఊహించనిదన్నారు. గత టీడీపీ ప్రభుత్వం 2018లో బీచ్ పెస్టివల్ చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వాలు మారితే మంచి కార్యక్రమాలు కొనసాగిస్తారన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వారు వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతోపాటు స్కామ్‌లు చేసి జేబులు నింపుకున్నారని ఆరోపించారు.
kollu-03.jpg


సీఎం చంద్రబాబు ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తూ.. కొల్లు రవీంద్ర మంచి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ప్రతి క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు టూరిజం అభివృద్ధి గురించి మాట్లాడతారని గుర్తు చేశారు. ఇక్కడ నిర్వహించిన బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, కయ కింగ్ పోటీలు బాగున్నాయని ప్రశంసించారు. ఎప్పుడూ పోటీలు జరిగినా మేము వస్తామని క్రీడాకారులు తెలిపారన్నారు. మచిలీపట్నంలో ఉన్న ఆన్ సర్వే భూమి పర్యాటక శాఖకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఆన్ సర్వే భూముల్లో పర్యాటక రంగానికి ఉపయోగ పడేలా రిసార్ట్స్ నిర్మాణం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

kollu-04.jpg


గతంలో తాము ప్లేమింగో పెస్టివల్ నిర్వహించే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. వైసీపీ నిర్వాకం వల్ల పక్షులు కూడా రాష్ట్రానికి రాకుండా వెళ్లిపోయాయని వ్యంగ్యంగా అన్నారు. వైసీపీ ముసుగులో ఉన్న కొంతమంది ఒళ్ళు బలిసి మహిళలను కించ పరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బుంగమూతులు.. బుజ్జగింపులు

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 08 , 2025 | 10:17 PM