ఏపీకి పోలవరం జీవనాడి: కిరణ్‌కుమార్‌రెడ్డి
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:29 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని, పోలవరాన్ని వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నె

నెల్లూరు (స్టోన్‌హౌ్‌సపేట), జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని, పోలవరాన్ని వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం వేగవంతంగా అభివృద్ధి చెందడంతోపాటు రాష్ట్రానికి కేంద్రం నిధులు పెద్ద ఎత్తున అందిస్తోందన్నారు. 7.20 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 23 లక్షల ఎకరాలు స్థిరీకరణ, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పోలవరంతోనే సాధ్యమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు డబ్బుతోపాటు సాంకేతిక పరమైన అంశాలు చాలా ఉన్నాయన్నారు. ఛత్తీ్‌సగఢ్, ఒడిశా రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం తెలుగు రాష్ట్రాలకు ఉందన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సమయంలోనూ ఈ విషయాలను తెలియజేసినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కలిసికట్టుగా కృష్ణాజలాలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. అమరావతిని కూటమి ప్రభుత్వంలో వేగవంతంగా పూర్తి చేయాలని, ఎంత వేగంగా అభివృద్ధి చేస్తే అంతకంటే వేగంగా కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చేసిందని, అభివృద్ధిలో బాగా వెనుకపడ్డామన్నారు.