Kakani Interrogation: రెండోరోజూ కాకాణిది అదే తీరు
ABN , Publish Date - Jun 08 , 2025 | 03:33 AM
మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు కస్టడీలో రెండోరోజు శనివారం కూడా నోరు మెదపలేదని తెలిసింది. పొదలకూరు మండలం రుస్తుం మైన్స్‌లో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణిని....
ఏ ప్రశ్న అడిగినా తెలియదనే జవాబు
నేటితో ముగియనున్న పోలీసు కస్టడీ
నెల్లూరు(క్రైం), జూన్ 7(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు కస్టడీలో రెండోరోజు శనివారం కూడా నోరు మెదపలేదని తెలిసింది. పొదలకూరు మండలం రుస్తుం మైన్స్‌లో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణిని కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కృష్ణపట్నం పోలీసు స్టేషన్‌లో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మధాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విచారణ సాగింది. పోలీసులు ఏ ప్రశ్న అడిగినా ‘నాకు తెలియదు, గుర్తులేదు...’ అని మాత్రమే కాకాణి సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఆదివారంతో కాకాణి పోలీసు కస్టడీ ముగియనుంది. కాగా, రుస్తుం మైన్స్ అక్రమ తవ్వకాల కేసులో వేమిరెడ్డి అరవింద్ కుమార్‌రెడ్డి(ఏ6)కి నాలుగు రోజుల క్రితం బెయిల్ మంజూరు కాగా, కరుణాకర్‌రెడ్డి(ఏ7), శివారెడ్డి (ఏ8)కి హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారు శనివారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.