Share News

TDP Mahanadu 2025: చంద్రబాబు వయస్సులో పెద్ద వారు.. హార్ట్‌లో చాలా యంగ్

ABN , Publish Date - May 27 , 2025 | 04:21 PM

తన తల్లి ఎంత ఆవేదన చెందిందనేది తాను తాను కళ్ళారా చూశానని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కానీ వైఎస్ జగన్ కుటుంబంలో ఎవరిని కూడా తాము ఒక్క మాట అనలేదన్నారు.

TDP Mahanadu 2025: చంద్రబాబు వయస్సులో పెద్ద వారు.. హార్ట్‌లో చాలా యంగ్
AP MInister Nara Lokesh

కడప, మే 23: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వయస్సులో పెద్ద వారు.. కానీ హార్ట్‌లో చాలా యంగ్ అంటూ ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చమత్కరించారు. ఆయనలాగా ఎవరు యోగా చేయలేరన్నారు. కడపలో మహానాడు మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ నేతలతో మంత్రి నారా లోకేశ్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తాను, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శావాసనం వేస్తే హాయిగా నిద్రపోవచ్చునని భావించామన్నారు.

మహిళలను గౌరవించాలన్నారు. ముందు తమ భాషను మార్చుకోవాలంటూ రాజకీయ నాయకులకు ఆయన కీలక సూచన చేశారు. ఎందుకంటే సమాజంలో రాజకీయ నాయకులను అత్యధికంగా ఫాలో అవుతున్నారన్నారు. అందువలన రాజకీయ నాయకులు తమ భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.


యువగళంలో భాగంగా రాయలసీమలో తాను పాదయాత్ర చేసినప్పుడు తనకా మార్పు స్పష్టంగా కనిపించిందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. తన తల్లి ఎంత ఆవేదన చెందిందో తాను కళ్ళారా చూశానన్నారు. కానీ వైఎస్ జగన్ కుటుంబంలో ఎవరిని కూడా తాము ఒక్క మాట అనలేదన్నారు. తమ వాళ్లు ఎవరు ఏమైనా మాట్లాడినా తాము ఊరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.


ఇంగ్లీష్‌తో పాటు తెలుగు మీడియం కూడా ఆప్షన్ ఇస్తానని తాను ఎన్నికల ముందు చెప్పానని.. నేటికి తాను ఆ మాటకే కట్టుబడి ఉన్నానన్నారు. తాము మంచి చేస్తాం.. రాష్ట్రానికి మంచి చేస్తాం.. 2029 ఎన్నికల్లో ఎవరనేది ప్రజలు డిసైడ్ చేస్తారని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

రెడ్ బుక్ పేరు చెబితే చాలా మంది భయపడుతున్నారని గుర్తు చేశారు. కొంత మంది అడవుల్లోకి, మరికొందరు బాత్ రూమ్‌లో జారిపడుతున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. మరికొంత మంది ఆసుపత్రి పాలు అవుతున్నారని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు, చేసిన పనులపై త్వరలో సమీక్షించుకుంటామని మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కొడాలి నాని ఆరోగ్యం.. కుటుంబ సభ్యుల్లో ఆందోళన

జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటన

For AndhraPradesh News and Telugu News

Updated Date - May 27 , 2025 | 04:43 PM