MLA Reddappa Gari Madhavi : పింఛన్ల పేరుతో వైసీపీ నేతల అరాచకం
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:43 AM
‘పింఛన్ల పేరుతో వైసీపీ నాయకులు చాలా అరాచకాలకు పాల్పడ్డారు. ఇప్పుడూ పాల్పడుతున్నారు’ అని కడప ఎమ్మెల్యే, విప్ రెడ్డప్పగారి మాధవి ఆరోపించారు.

మహిళలను బెదిరించి, లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు: మాధవి
‘పింఛన్ల పేరుతో వైసీపీ నాయకులు చాలా అరాచకాలకు పాల్పడ్డారు. ఇప్పుడూ పాల్పడుతున్నారు’ అని కడప ఎమ్మెల్యే, విప్ రెడ్డప్పగారి మాధవి ఆరోపించారు. మంగళవారం జరిగిన విప్‌ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో చాలా మంది మహిళలు నిబంధనలకు విరుద్ధంగా ఒంటరి మహిళ, వితంతు పింఛన్లు తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు దొంగ సర్టిఫికెట్లతో వారికి పింఛన్లు ఇప్పించారు. ప్రభుత్వం మారాక వారిని వైసీపీ నేతలు టార్చర్ చేస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకోవాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది మహిళలు దిక్కుతోచక.. ‘మాకు భర్త ఉన్నాడు. పింఛను వద్దు. కేసు లేకుండా చూడండి’ అంటూ మా వద్దకు వస్తున్నారు’’ అని మాధవి విప్‌ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.