Tirumala : తిరుమల చేరుకున్న చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:52 AM
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఆదివారం తిరుమలకు వచ్చారు.

తిరుమల, ఫిబ్రవరి9 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఆదివారం తిరుమలకు వచ్చారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి బస, దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా, జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.