Janasena: పవన్‌పై జగన్ సెన్సేషనల్ కామెంట్స్.. జనసైనికులు ఎలా రియాక్ట్ అయ్యారంటే..
ABN , Publish Date - Mar 06 , 2025 | 05:47 PM
ఏలూరు జిల్లాలో జనసైనికులు ఆందోళన చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్లకార్డుల ప్రదర్శన చేశారు.
ఏలూరు జిల్లా : 'ఆ మనిషి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ' అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ ఏపీలో సంచలనంగా మారాయి. జగన్ చేసిన ఈ కామెంట్స్‌పై జనసైనికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు జగన్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా జనశ్రేణులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్‌పై ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ద్వారకాతిరుమల ఎంపీడీవో కార్యాలయం వద్ద జనసేన నాయకులు నిరసన చేశారు. 'అర డజనుకు ఎక్కువ డజనుకు తక్కువ, ఈడీకి ఎక్కువ సీబీఐకి తక్కువ' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద నుండి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు.
మాజీ సీఎం జగన్ తన పద్ధతి మార్చుకోవాలని జనసైన నేతలు హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్‌ను విమర్శించే స్థాయి జగన్‌కు లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో మిమ్మల్ని కూర్చోబెట్టారో మర్చిపోయారా జగన్ అంటూ ప్రశ్నించారు. తండ్రి, బాబాయి చావును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన జగన్ మా అధినేతను విమర్శించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే జనసేన శ్రేణులు సహించబోరని నరసింహ మూర్తి ద్వారకాతిరుమల మండల జనసేన అధ్యక్షుడు హెచ్చరించారు.
Also Read:
పోసానికి ఓ కేసులో షాక్.. రెండు కేసుల్లో ఊరట
గంజాయి విక్రయిస్తే ఇక అంతే.. హోంమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్