Share News

Minister Anagani: సైకో సీఎంతో రాష్ట్రం సర్వనాశనం

ABN , Publish Date - May 06 , 2025 | 05:29 AM

వైసీపీ పాలనలో రాష్ట్రం దారుణంగా నాశనమైనట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని, యువతకు ఉపాధి లభించడం లేదని విమర్శించారు.

 Minister Anagani: సైకో సీఎంతో రాష్ట్రం సర్వనాశనం

  • పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు పరుగులు పెట్టించిన దుర్మార్గుడు జగన్‌: మంత్రి అనగాని

  • టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్‌: బాలకృష్ణ

హిందూపురం, మే 5(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది. జగన్‌ సృష్టించిన భయానక వాతావరణంవల్ల పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్లిపోయాయి. యువతకు ఉపాధి లేకుండా పోయింది’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం కొల్లకుంట ఇందిరమ్మ కాలనీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలసి మంత్రి 230 మందికి పొజిషన్‌ సర్టిఫికెట్‌లను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశాం. సూపర్‌ సిక్స్‌ పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం’ అని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు జ్ఞాపిక అందజేసి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ ‘టీడీపీ అంటే జవాబుదారీతనం. రాయలసీమ గడ్డ నా అడ్డా. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్డార్‌’ అని వార్నింగ్‌ ఇచ్చారు.

Updated Date - May 06 , 2025 | 05:29 AM