ISRO : సెంచరీ కొట్టనున్న షార్
ABN , Publish Date - Jan 22 , 2025 | 05:05 AM
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో అరుదైన మైలురాయికి సిద్ధమవుతోంది.
వందో రాకెట్ ప్రయోగానికి సన్నద్ధం
నెలాఖరులో జీఎ్‌సఎల్వీ-ఎఫ్15 ప్రయోగం
కక్ష్యలోకి ఎన్‌వీఎ్‌స-02 నావిగేషన్ ఉపగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం
సూళ్లూరుపేట, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో అరుదైన మైలురాయికి సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ఇస్రో ఇక్కడ వందో రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. జీఎ్‌సఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా ఎన్‌వీఎ్‌స-02 ఉపగ్రహాన్ని రోదసీలోకి చేర్చనుంది. ఇప్పటికే షార్ రెండో ప్రయోగ వేదికపై రాకెట్ అన్ని దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. రాకెట్ శిఖర భాగంలో అమర్చడానికి ముందు క్లీన్‌రూమ్‌లో ఉపగ్రహానికి తుది పరీక్షలు నిర్వహించారు. ఈ నెలాఖరులో ప్రయోగం ఉండొచ్చని భావిస్తున్నారు. తేదీని అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. కాగా... ఎన్‌వీఎ్‌స-02 రెండో తరానికి చెందిన నావిగేషన్ ఉపగ్రహం. ఈ సిరీ్‌సలో ఇస్రో ఇప్పటికే 7 ఉపగ్రహాలను ప్రయోగించింది. వాటిలో మూడింటి కాలపరిమితి ముగిసింది. వాటి స్థానంలో కొత్త ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 2023 మే 29న జీఎ్‌సఎల్వీ-ఎఫ్12 రాకెట్ ద్వారా ఎన్‌వీఎ్‌స-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పుడు జీఎ్‌సఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్ -02 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. షార్‌లో ఇది వందో ప్రయోగం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీని ఇస్రో ఆహ్వానించింది. దీనికి ప్రధాని ఆమోదం తెలిపారని, కార్యక్రమం ఖరారు కావాల్సి ఉందని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News