Share News

Visakhapatnam Yoga Event: విశాఖలో ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ప్రధాని మోదీ హాజరు

ABN , Publish Date - Jun 21 , 2025 | 06:54 AM

విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరయ్యారు.

Visakhapatnam Yoga Event: విశాఖలో ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ప్రధాని మోదీ హాజరు
Visakhapatnam Yoga Event

విశాఖపట్నం: సాగర తీరంలోని విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day 2025) ఘనంగా ప్రారంభమైంది. ఈ భారీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరయ్యారు. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ అనే థీమ్‌తో మొదలైన ఈ కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 పేరిట నిర్వహించబడుతోంది. ఆర్కే బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 26 కిలోమీటర్ల పొడవునా 247 యోగా విభాగాలు ఏర్పాటు చేశారు.


ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఇతర ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, యోగా సంఘాలు, నౌకాదళం, కోస్టల్ గార్డు సభ్యులు, పారిశ్రామికవేత్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం 7 గంటలకు 2 లక్షల 70 వేలు దాటిన యోగీలు. సూరత్ లో 1,47,952 మంది రికార్డ్ అధిగమించడడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు కానున్న విశాఖ యోగా కార్యక్రమం.


శుక్రవారం సాయంత్రం భువనేశ్వర్ నుంచి విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ, ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వద్ద బస చేశారు. శనివారం ఉదయం 6:25 గంటలకు ఆర్కే బీచ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాక, ప్రపంచ ఐక్యతకు కూడా దోహదపడుతుందని ప్రధాని పేర్కొన్నారు.

2015 నుంచి ప్రతి ఏటా..

ప్రధాని మోదీ 2014లో యోగా దినోత్సవ ప్రతిపాదన చేయడంతో, 2015 నుంచి జూన్ 21న ఈ వేడుకలు జరుగుతున్నాయి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజలు దీని పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు ఉదయం 6.30 నుంచి ఉదయం 7 గంటల వరకు దేశంలోని లక్షకు పైగా ప్రదేశాలలో సామూహిక యోగా ప్రదర్శనలు చేశారు.


ఇవీ చదవండి:

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 21 , 2025 | 07:50 AM