Share News

Indian Student: అమెరికాలో తూర్పు యువకుడి మృతి

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:33 AM

తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన శనగన హరి కిరణ్‌ గౌడ్‌ 25 అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు.

Indian Student: అమెరికాలో తూర్పు యువకుడి మృతి

చాగల్లు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన శనగన హరి కిరణ్‌ గౌడ్‌ (25) అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు శనివారం వెల్లడించారు. హరి కిరణ్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సెంట్రల్‌ మిస్సోరి వారి వీసాపై అమెరికాలో ఎంఎస్‌ చదువుతూ, పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడు. మిత్రులతో కలిసి జలపాతానికి స్నానానికి వెళ్లి అందులో కొట్టుకుపోయాడు. మృతుని తండ్రి రామకృష్ణ గౌడ్‌ పీఎంపీ వైద్యుడిగా సేవలందిస్తున్నారు. హరికిరణ్‌ మరణ వార్తతో గ్రామంలో విషాదం నెలకొంది.

Updated Date - Jul 06 , 2025 | 04:33 AM