Share News

Postal: పోస్టల్‌ సేవలు.. ఇంటి నుంచే

ABN , Publish Date - Aug 06 , 2025 | 11:51 AM

నవీకరణలో తపాల శాఖ మరో మైలురాయి చేరుకుంది. కంప్యూటర్‌ అనుసంధానం, డిజిటలైజేషన్‌, ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్‌తో ముందుకు సాగుతుండగా తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. సొంతంగా ఎ.పి.టి 2.0 (అడ్వాన్స్‌డ్‌ పోస్టల్‌ అండ్‌ ఇన్‌పర్మేషన్‌ టెక్నాలజీ)ని రూపొందిం చుకుంది.

Postal: పోస్టల్‌ సేవలు.. ఇంటి నుంచే

- ఐఎంఏ యాప్‌తో మరింత విస్తృతం

- ఐఎంఏ యాప్‌తో మరింత విస్తృతం

నవీకరణలో తపాల శాఖ మరో మైలురాయి చేరుకుంది. కంప్యూటర్‌ అనుసంధానం, డిజిటలైజేషన్‌, ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్‌తో ముందుకు సాగుతుండగా తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. సొంతంగా ఎ.పి.టి 2.0 (అడ్వాన్స్‌డ్‌ పోస్టల్‌ అండ్‌ ఇన్‌పర్మేషన్‌ టెక్నాలజీ)ని రూపొందిం చుకుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించగా సత్ఫలితాలు రావడంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని పోస్టీఫీసుల్లోనూ ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

(అమలాపురం, ఆంధ్రజ్యోతి)

భారతీయ తపాలా శాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సేవలను మరింత విస్తృతం చేసింది. ఇంటి వద్ద నుంచేపోస్టల్‌ సేవలు పొందే అవకాశం కల్పించింది. ఇప్పటికే గ్రామీణ స్థాయిలో బ్యాంకింగ్‌ రంగంలో దూసుకుపోతోంది. ఇకపై ప్రఖ్యాత డోర్‌ డెలివరీ సంస్థలు అయిన ప్రైవేటు ఈ-కామర్స్‌తో పోటీపడుతూ తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో డోర్‌ డెలివరీకి శ్రీకారం చుట్టింది.


తపాలా శాఖ న్యూ జనరేషన్‌ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ పోస్టల్‌ సేవలను ఖాతాదారులకు అందుబాటులోకి తెచ్చింది. అడ్వాన్స్‌డ్‌ పోస్టల్‌ టెక్నాలజీ (ఏపీటీ-2.0) సేవలను జిల్లాలోని అన్ని తపాలా కార్యాలయాలకు అనుసంధానం చేశారు. ప్రస్తుతం తపాలా సేవలన్నీ నూరు శాతం వెబ్‌ ఆధారిత క్లౌడ్‌ టెక్నాలజీతో అనుసంధానం చేశారు. ఏపీటీ 2.0 విధానంలో అత్యాధునికంగా జరుగుతున్న సైబర్‌ నేరాలను నియంత్రించడంతో పాటు వాటిపై ఎప్పుడూ నిఘా కొనసాగుతూనే ఉంటుంది.


ఐఎంఏ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకుంటే చాలు..

వినియోగదారులు, ఖాతాదారులు ఏపీటీ సేవలు పొందేందుకు మొబైల్‌ ఫోన్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఐఎంఏ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు. వెంటనే ఐడీ నెంబరు వస్తుంది. ఆ నెంబరు ద్వారా రిజిస్టర్‌ పోస్టు, స్పీడ్‌ పోస్టు తదితర తపాలా సేవలను ఇంటి నుంచేపొందవచ్చు. పోస్టు చేయదలచిన పార్సిల్‌ అంచనా బరువు, సమీప పోస్టాఫీసు వివరాలను ఐఎంఏ యాప్‌లో నమోదు చేస్తే సంబంధితప్రాంత పోస్టుమన్‌ ఇంటి వద్దకే వచ్చి పార్సిల్‌తీసుకెళ్తాడు. బరువు ఆధారంగా చార్జీలు ఉంటాయి. సంబంధిత చార్జీలను వినియోగదారులు నగదు, యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. ఐఎంఏ యాప్‌ ద్వారా ఏ సమయంలోనైనా పార్సిల్‌నుబుక్‌ చేసుకోవచ్చు. పికప్‌ మాత్రం పోస్టాఫీసు పనివేళల్లోనే ఉంటుంది. ఐఎంఏ యాప్‌ నుంచే ఖాతాదారులు తపాలా సుకన్య సమృద్ధి యోజన, కిసాన్‌ వికాస్‌ పత్రాలు తదితర పొదుపు పథకాల్లో డిపాజిట్‌ చేసేందుకు కూడా వెలుసుబాటు కల్పించారు.


ap5.jpg

ప్రజలకు చేరువగా తపాలా సేవలు ఆర్‌.నవీన్‌కుమార్‌, పోస్టల్‌ సూపరింటెండెంట్‌, అమలాపురం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా డివిజన్‌లోని అన్ని తపాలా కార్యాలయాలను అత్యాధునిక టెక్నాలజీతో అనుసంధానం చేశాం. ఇప్పటికే సేవలు ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మరిన్ని సేవలను అందించనున్నాం. ప్రైవేటు ఈ-కామర్స్‌ సంస్థలకు పోటీగా సరికొత్త టెక్నాలజీతో ఐడీసీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాం.


ఇప్పటికే కాకినాడ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్‌ డెలివరీ సెంటర్‌ (ఐడీసీ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇకపై తపాలా శాఖ సొంత వాహనాల ద్వారానే పార్సిల్స్‌ సరఫరా చేసే విధంగా కేంద్ర తపాలా శాఖ చర్యలు చేపట్టింది. విదేశాలకు పంపించే పార్సిల్స్‌ సంఖ్య గతంలోకంటే పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, పీఎం కిసాన్‌ యోజన తదితర పథకాల నిధులను లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచి పోస్టాఫీసుల్లోనే పొందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్‌ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 06 , 2025 | 11:51 AM