Share News

Hindupuram: డీజేతో యమ డేంజర్‌ గురూ..

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:21 PM

మూడేళ్ల క్రితం హిందూపురం పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అధిక సౌండ్‌ వచ్చే డీజే శబ్దానికి ఓ యువకుడి గుండె ఆగింది. ఏడాది క్రితం హిందూపురం పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అధిక సౌండ్‌ ఉన్న డీజేలు వినియోగించారు.

Hindupuram: డీజేతో యమ డేంజర్‌ గురూ..

- ఎక్కువ శబ్దాలతో పెనుముప్పు

- హెచ్చరికలతోనే సరిపెడుతున్న యంత్రాంగం

హిందూపురం(అనంతపురం): మూడేళ్ల క్రితం హిందూపురం(Hindupuram) పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అధిక సౌండ్‌ వచ్చే డీజే శబ్దానికి ఓ యువకుడి గుండె ఆగింది. ఏడాది క్రితం హిందూపురం పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అధిక సౌండ్‌ ఉన్న డీజేలు వినియోగించారు. ఈ శబ్దానికి రెండు పశువులు మృతిచెందాయి. గత యేడాది డీజే సౌండ్‌ ఎక్కువగా ఉండడంతో ఓ వృద్ధుడికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసు పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలాంటి సంఘటనలు నిత్యం జరు గుతూనే ఉన్నాయి.


ఇటీవల వేడుక అయినా, శుభకార్యమైనా డీజేలు, టపాసులు తప్పనిసరి అయ్యాయి. మితిమీరిన శబ్దాలను వెలువరిస్తున్న డీజేలు ప్రాణాలు తీసేస్తున్నాయి. శబ్దాల హోరుకు వృద్ధులు, చిన్నారులేకాక యువత కూడా బలవుతున్నారు. శబ్ద కాలుష్యం గర్బిణీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గర్భాధారణ నుంచి 60 రోజుల లోపు పిండంపై డీజే సౌండ్‌ అధికంగా పడుతుంది. వీటిని అరికట్టాల్సిన అధికార యంత్రాంగం, సంబంధిత శాఖలు హెచ్చరికలకే పరిమితమవుతున్నాయి.


మితిమీరిన శబ్దాలతో ముప్పే

వినాయక నిమజ్జనం సందర్భంగా డీజేల వినియోగం అధికమవు తోంది. ఒకప్పుడు సిటీలకే పరిమితమైన డీజేలు పట్టణం, పల్లెకు కూడా పాకాయి. వినాయక విగ్రహం పెట్టారంటే తప్పకుండా డీజే ఉండాల్సిందే. డీజే శబ్ద తీవ్రతను కొలవడానికి డెసిబుల్‌ (డీబీ)అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. నివాస ప్రాంతాల్లో 55 డీబీ, రాత్రిపూట 45 డీబీ శబ్దాన్ని వినియోగిం చవచ్చు. వ్యాపార సముదాయాల్లో పగటిపూ ట 65 డీబీ, రాత్రి పూట 55, పరిశ్రమలున్న ప్రాంతాల్లో పగటి పూట 75, రాత్రిపూట 65, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలున్న ప్రాంతాల్లో పగలు 50, రాత్రిపూట 40డీబీలు మా త్రమే వాడుకోవాలి. ప్రస్తుతం డీజేలకు 80 నుంచి 100 డీబీల దాకా వాడుతున్నారు. దీనివల్ల ప్రాణాలకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.


zzzzz.jpg

వేడుక ఏదైనా డీజే ఉండాల్సిందే..

ఇటీవల పుట్టిన రోజు వేడుకలు, పెళ్లిళ్లు, ఇ తర శుభకార్యాలు, దేవుడి కార్యక్రమాలకు డీజేల వాడకం అధికమయిం ది. రూ.30వేలు మొదలుకుని రూ.5 లక్షలు చె ల్లిస్తూ డీజేలు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం డీజే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఒకప్పుడు మేళతాళాలతో కార్యక్రమాలు నిర్వహించేవారు. తరువాత బ్యాండ్‌సెట్‌తో నిర్వహించేవారు. ఆ తరువాత చిన్నపాటి సౌండ్‌ స్పీకర్లు ఏర్పాటు చేసుకునే వారు. ప్రస్తుతం డీజే లేనిదే కార్యక్రమం లేదనే స్థాయిలో వినియోగిస్తున్నారు. హిందూపురంలో గురువారం జరిగే వినాయక నిమజ్జన వేడుకలకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ(Tamilnadu, Karnataka, Andhrapradesh, Telangana) నుంచి సుమారు 80కి పైగా డీజే వాహనాలు బుక్‌ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని డీజే వాహనాలు హిందూపురానికి చేరుకున్నాయి.


పరిమితి దాటితే ప్రమాదమే

సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారు 50 డీబీ లోపు సౌండ్‌ వినవ చ్చు. 80డీబీ దాటితే ఇబ్బందే. ఇక 100, 120 డీబీల సౌండ్‌ ఉంటే గుండె జబ్బున్న వారికి తీవ్ర ప్రభావం చూపుతుంది. 120 దాటితే చిరాకు, చ ర్మంపై రోమాలు నిక్కపొడుచుకోవడం, విపరీతమైన తలబాధ వస్తుంది. 150 దాటితే చెవుల్లో వినికిడి కణాలపై ప్రభావం పడుతుంది. దీనివల్ల పాక్షికంగా వైకల్యం కూ డా కలగవచ్చు. ఇక 180డీబీ దాటితే కర్ణభేరి పగిలిపోయే ప్రమాదం ఉంది. శక్తికోల్పోయి విని కిడి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అంతేకాక రక్తపోటు, బ్రెయిన్‌ స్ర్టోక్‌కూడా వచ్చే అ వకాశం ఉంది. అనారోగ్యంతో ఉన్నవారు డీజే సౌండ్‌కు దూరంగా ఉండటం మంచిది.

- వెంకటరమణనాయక్‌, వైద్యుడు


కేసు నమోదు చేస్తాం

ఎలాంటి వేడుకల్లో అయినా డీజేలకు అనుమతిలేదు. నిబంధ నలు ఉల్లంఘించి అధిక శబ్దం ఉన్న డీజేలు వాడితే వాటిని సీజ్‌ చేసి కేసు నమోదు చేస్తాం. ఎవ రికైనా ఏదైనా ప్రమాదం సంభవిస్తే సంబధిత నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.

- మహేష్‌, డీఎస్పీ


ఈ వార్తలు కూడా చదవండి..

రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 04 , 2025 | 01:21 PM