Hidden Treasure: ఆ నిధుల కోసం పెద్ద ప్లానే వేశారు.. కట్ చేస్తే మొత్తం ఫసక్..
ABN , Publish Date - Nov 07 , 2025 | 09:58 PM
సాధారణంగా కొత్తవాళ్లు ఊళ్లలో ఒకసారి కనిపిస్తేనే గ్రామస్తులు కాస్త అనుమానం వ్యక్తం చేస్తారు. అదే పలుమార్లు.. ఒకే ప్రాంతంలో తిరుగాడుతూ కనిపిస్తే.. నో డౌట్.. ఎవడ్రా నువ్వు అని..
అనంతపురం, నవంబర్ 7: సాధారణంగా కొత్తవాళ్లు ఊళ్లలో ఒకసారి కనిపిస్తేనే గ్రామస్తులు కాస్త అనుమానం వ్యక్తం చేస్తారు. అదే పలుమార్లు.. ఒకే ప్రాంతంలో తిరుగాడుతూ కనిపిస్తే.. నో డౌట్.. ఎవడ్రా నువ్వు అని గల్లా పట్టి నిలదీస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. ఊర్లో అనుమానాస్పద రీతిలో తిరుగుతున్న ముఠాను పట్టుకున్నారు గ్రామస్తులు. మరి ఈ ముఠా ఎందుకు ఆ ఊళ్లో తిరుగుతోంది.. వారి లక్ష్యమేంటి.. గ్రామస్తులు వారిని ఏం చేశారు.. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
సత్యసాయి జిల్లా నంబులపూల కుంట మండలంలోని దనియాని చెరువు సమీపంలో ఉన్న నర సింహస్వామి ఆలయ పరిసరాల్లో గుప్త నిధుల త్రవ్వకం కలకలం రేపింది. గుప్త నిధుల కోసం వచ్చిన ముఠాను గ్రామస్థులు పట్టుకున్నారు. గురువారం రాత్రి ఆలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గ్రామస్థులు గమనించారు. ఆలయాన్ని చుట్టిముట్టి ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న పూజా సామగ్రి, ధాన్యాలు చూసి విచారించగా అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం పెద్ద మండెంకు చెందిన రేవతితో పాటు మదనపల్లికి చెందిన మరో ఆరుగురు వచ్చినట్లు చెప్పారు. ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత గ్రామ శివారులో గాలించగా మరొక వ్యక్తి కనిపించడంతో వెంబడించి పట్టుకున్నారు. మరో ముగ్గురు పురుషులతోపాటు మహిళ పరారయ్యారు. ఆలయం వద్ద గ్రామస్థులు, పోలీసులు కాపలా ఉన్నారు. పట్టుబడిన ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు.
Also Read:
KTR FIRES CM Revanth: రేవంత్‌కి దమ్ముంటే మంత్రుల అక్రమ నిర్మాణాలను తొలగించాలి: కేటీఆర్
Birthday Bash For Buffalo: దున్నపోతుకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు.. ఎక్కడంటే..