Birthday Bash For Buffalo: దున్నపోతుకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు.. ఎక్కడంటే..
ABN , Publish Date - Nov 07 , 2025 | 09:51 PM
గ్రామస్తులంతా కలిసి దున్నపోతు రెండవ పుట్టిన రోజు వేడుకలు అత్యంత ఘనంగా చేశారు. ఇందుకోసం ఊరంతా ఏకమైంది. డీజేలు పెట్టించారు. షేరా మెడలో దండలు వేసి, బెలూన్లు కట్టి ఎంతో అందంగా ముస్తాబు చేశారు.
ఉత్తర ప్రదేశ్‌లోని అమ్‌రోహా జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. సుంగర్హ్ గ్రామానికి చెందిన ప్రజలు దున్నపోతుకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అది కూడా లక్షలు ఖర్చు పెట్టి మరీ పుట్టిన రోజు వేడుకలు చేశారు. ఇంతకీ సంగతేంటంటే.. గ్రామానికి చెందిన ఇస్రార్ అనే వ్యక్తికి షేరా అనే దున్నపోతు ఉంది. అది ఊరిలో కలియ తిరుగుతూ అందరితో ఎంతో ప్రేమగా ఉండేది. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు.
షేరా రెండవ పుట్టిన రోజు వేడుకలు అత్యంత ఘనంగా చేశారు. ఇందుకోసం ఊరంతా ఏకమైంది. డీజేలు పెట్టించారు. షేరా మెడలో దండలు వేసి, బెలూన్లు కట్టి ఎంతో అందంగా ముస్తాబు చేశారు. భారీ కేకులను సైతం కట్ చేయించారు. ఈ మొత్తం వేడుక కోసం గ్రామస్తులు ఏకంగా లక్షల రూపాయలు పైనే ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇంట్లో వాళ్లకు కూడా ఇంత ఘనంగా పుట్టిన రోజు వేడుకలు చేసి ఉండరు. దున్నపోతుకు చేస్తున్నారు. శభాష్’..‘ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు కేవలం ఉత్తర భారత దేశంలోనే జరుగుతాయి’..‘ఆ దున్నపోతు వల్ల గ్రామస్తులకు చాలా రకాల లాభాలు ఉంటాయి. అందుకే వాళ్లు దానికి పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆర్జేడీ ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ప్రభావం.. తేజస్వి ఏమన్నారంటే
మీరట్ బ్లూ డ్రమ్ కేసు.. కూతురు చేసిన పని తట్టుకోలేక..