Muskan Rastogi Case: మీరట్ బ్లూ డ్రమ్ కేసు.. కూతురు చేసిన పని తట్టుకోలేక..
ABN , Publish Date - Nov 07 , 2025 | 09:22 PM
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడు షాహిల్‌తో కలిసి భర్తను చంపేసింది. తర్వాత శవాన్ని బ్లూ డ్రమ్‌లో కుక్కేసింది. ప్రస్తుతం నిందితులిద్దరూ జైల్లో ఉన్నారు. ముస్కాన్ కుటుంబం అన్ని రకాలుగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
మీకు మీరట్ ముస్కాన్ కేసు గుర్తుందా?. ముస్కాన్ కేసు అంటే గుర్తుకు రాకపోవచ్చు.. బ్లూ డ్రమ్ మర్డర్ కేసు అంటే ఇట్టే గుర్తుకువస్తుంది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపి బ్లూ డ్రమ్ములో పాతేసిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఓ వైపు ముస్కాన్, షాహిల్‌లు జైలులో ఊచలు లెక్కిస్తూ ఉన్నారు. మరో వైపు ముస్కాన్ కుటుంబం మొత్తం అవమాన భారంతో అల్లాడిపోతోంది. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక ఊరు విడిచి వెళ్లిపోవడానికి డిసైడ్ అయింది.
ఈ మేరకు ముస్కాన్ కుటుంబం ఇందిరా నగర్‌లోని ఇంటిని అమ్మడానికి ప్రయత్నాలు మొదలెట్టింది. ఇంటి గోడల మీద ‘హౌస్ ఫర్ సేల్’ అనే పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఆ పోస్టర్ల తాలూకా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ముస్కాన్ తండ్రి ప్రమోద్ కుమార్ రస్తోగి ఆ పోస్టర్లు చింపేశారు. ఇంటి అమ్మకంపై ప్రమోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మాకు ఇక్కడ బాధాకరమైన అనుభవాలు మాత్రమే మిగిలాయి.
మేము ఇక్కడినుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నాము. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాము’ అని అన్నారు. ప్రమోద్ భార్య కవిత, కొడుకు రాహుల్ కూడా ఇదే విషయం చెప్పారు. మార్చి 3వ తేదీన జరిగిన సంఘటన తర్వాత తమ జీవితం సామాజికంగా, ఆర్థికంగా బాగా దెబ్బతిందని వారు అన్నారు. ఇక, స్థానికులు ఏమంటున్నారంటే.. ‘ఒకప్పుడు ప్రమోద్‌కు నగల వ్యాపారిగా ఈ ప్రాంతంలో చాలా మంచి పేరు ఉండేది. ముస్కాన్ భర్తను హత్య చేసిన తర్వాత పేరు చెడిపోయింది. జనం ఆయన షాపునకు రావటమే మానేశారు. అతడి దగ్గర అప్పుగా నగలు తీసుకున్న వారు డబ్బులు ఇవ్వటం మానేశారు. ప్రమోద్ మానసికంగా దెబ్బ తిన్నాడు’ అని చెప్పుకొచ్చారు. కూతురు చేసిన పనితో ప్రమోద్ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది.
ఇవి కూడా చదవండి
10 మంది పేషంట్లను చంపిన నర్స్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..
భవానీ దీక్షల విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు: దుర్గ గుడి చైర్మన్