Share News

New AP DGP: డీజీపీగా హరీశ్‌కుమార్‌ గుప్తా

ABN , Publish Date - May 01 , 2025 | 04:48 AM

ఇన్‌చార్జ్‌ డీజీపీగా ఉన్న హరీశ్‌కుమార్‌ గుప్తా పూర్తి స్థాయి డీజీపీగా నియమించేందుకు యూపీఎస్సీ ప్యానెల్‌ నుంచి ఓకే వచ్చింది. పని తీరు సంతృప్తికరంగా ఉండటంతో ఆయన్నే రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయనుంది.

New AP DGP: డీజీపీగా హరీశ్‌కుమార్‌ గుప్తా

  • పూర్తిస్థాయి నియామకానికి ఓకే!

  • యూపీఎస్సీ ప్యానెల్‌ ద్వారా ఎంపిక

అమరావతి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చాలా ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి డీజీపీ నియామకం జరగనుంది. ప్రస్తుతం ఇన్‌చార్జి డీజీపీగా కొనసాగుతున్న హరీశ్‌ కుమార్‌ గుప్తాను పూర్తిస్థాయిలో ‘పోలీస్‌ బాస్‌’గా నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో బుధవారం యూపీఎస్సీ ప్రతినిధి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌తో కూడిన ప్యానల్‌ డీజీపీ ఎంపికపై సమావేశమైంది. డీజీ హోదా ఉన్న అధికారుల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా నుంచి... హరీశ్‌ కుమార్‌ గుప్తా, అంజనీ కుమార్‌, మాదిరెడ్డి ప్రతాప్‌ రెడ్డి పేర్లను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వీరిలో ఒకరిని డీజీపీగా నియమించ వచ్చు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హరీశ్‌ కుమార్‌ గుప్తాను ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఇన్‌చార్జి డీజీపీగా నియమించింది. పని తీరు సంతృప్తికరంగా ఉండటంతో ఆయననే పూర్తిస్థాయి డీజీపీగా నియమించాలని నిర్ణయించుకుంది. నియామక ఉత్తర్వులు జారీ చేసిన రోజు నుంచి.. రిటైర్‌మెంట్‌ వయసుతో సంబంధం లేకుండా రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు.


Also Read:

సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్

రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని

ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 01 , 2025 | 04:48 AM