AP News: చంద్రబాబు నివాసానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మరికాసేపట్లో..
ABN , Publish Date - Jan 18 , 2025 | 09:48 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ పూలమాలలతో ఘనస్వాగతం పలికారు.

గన్నవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport)కు చేరుకున్న అమిత్ షాకు ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, నారా లోకేశ్ (Nara Lokesh), అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. అలాగే ఎంపీలు కేశినేని చిన్ని, బాలశౌరి, సీఎం రమేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari), ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, పత్తిపాటి పుల్లారావు ఆయనకు వెల్కమ్ చెప్పారు.
అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి రోడ్డుమార్గాన అమిత్ షా బయలుదేరారు. కాగా, విజయవాడ చేరుకున్న కేంద్ర హోంమంత్రికి మహిళలు పెద్దఎత్తున పూలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. అమిత్ షా వెంట నారా లోకేశ్, పురందేశ్వరి ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే చేరుకున్నారు. కాగా, మరికాసేపట్లో కేంద్ర హోంమంత్రికి చంద్రబాబు విందు ఇవ్వనున్నారు.
ఈ నేపథ్యంలో అమిత్ షాను ఏపీ కూటమి నేతలు ఘనంగా సన్మానించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పెండింగ్ అంశాలు, హామీలు వంటి పలు అంశాలపై అమిత్ షా, చంద్రబాబు మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నివాసంలో విందు పూర్తయిన తర్వాత విజయవాడలోని ప్రైవేట్ హోటల్‌లో బస చేసేందుకు అమిత్ షా చేరుకుంటారు. రేపు(ఆదివారం) గన్నవరంలోని ఎన్‌డీఆర్‌ఎఫ్ వేడుకల్లో పాల్గొనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Tirumala: తిరుమల ఘటనలపై కేంద్ర హోంశాఖ సీరియస్..
Kadapa: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్.. చంద్రబాబుకు విజ్ఞప్తి..