Bapatla : బార్ లైసెన్సులకు స్పందన కరువు, ఎక్సైజ్ శాఖ ఇన్చార్జి ఆకస్మిక బదిలీ
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:47 PM
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. బార్ లైసెన్సులకు స్పందన కరువు, ఎక్సైజ్ శాఖ అధికారుల మెడకు చుట్టుకుంది. జిల్లా డీపీఈవోగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న బి. వెంకటేశ్వర్లును విజయవాడలోని కమిషనరేట్ కార్యాలయంలో రిపోర్టు చేయాలనే ఆదేశాలు..
బారు.. బేజారు!
ఎక్సైజ్ శాఖ ఇన్చార్జి ఈఎస్ వెంకటేశ్వర్లు ఆకస్మిక బదిలీ
ప్రకాశం జిల్లా డీపీఈవోకు ఇన్ చార్జి బాధ్యతలు
మరో ఇద్దరు సీఐలపైనా చర్యలకు రంగం సిద్ధం?
బార్ లైసెన్సుల్లో నామమాత్రపు స్పందనే కారణమా !
బాపట్ల, ఆంధ్రజ్యోతి: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. బార్ లైసెన్సులకు స్పందన కరువు, ఎక్సైజ్ శాఖ అధికారుల మెడకు చుట్టుకుంది. జిల్లా డీపీఈవో(డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్)గా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న బి. వెంకటేశ్వర్లును విజయవాడలోని కమిషనరేట్ కార్యాలయంలో రిపోర్టు చేయాలనే ఆదేశాలు శనివారమే వెలువడ్డాయి. ప్రకాశం డీపీఈవో ఎస్కే అయేషా. బేగంను బాపట్ల జిల్లా ఇన్చార్జిగా నియమించగా.. ఆమె నిన్న (సోమవారం) బాధ్యతలు తీసుకున్నారు. మరో ఇద్దరు ఎక్సై జ్ సీఐలపై కూడా బదిలీ వేటు పడనుందని తెలుస్తోంది.
ఈ చర్యల వెనుక ఆశించిన స్థాయిలో బార్ల ఏర్పాటుకు దరఖాస్తు లు రాకపోవడమే కారణంగా ఉన్న ట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 17 బార్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా గడువు ముగిసే నాటికి నిబంధనల ప్రకారం రెండు బార్లకే దరఖాస్తులు రావడంతో వాటికే లాటరీ ప్రక్రియ ముగించి బార్లను కేటాయించారు. గీత కార్మికు లకు రాయితీపై కేటాయించిన రెండు బార్లకు కూడా లైసెన్సుల జారీ ప్రక్రియ ముగిసింది. 17 బార్లకు గాను రెండింటికే దరఖాస్తులు రావడంపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిం చినట్లు సమాచారం. అత్యంత పూర్ పర్ఫామెన్స్ ఇచ్చిన రెండు. జిల్లాల్లో ఒకటి బాపట్లగా ఉండడంతో వెంటనే చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
ఎక్సైజ్ శాఖ అంటే భయం లేదా...
బార్ల దరఖాస్తుల అంశాన్ని ముడిపెట్టి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చర్యలకు దిగడం ఆ విభాగంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. నోటిఫికేషన్ జారీ చేసిన దగ్గరి నుంచి ధర ఖాస్తుల కోసం తాము చేయని ప్రయత్నం లేదని, కానీ నిర్వాహకులు ముందుకు రాలేదని ఎక్సైజ్ శాఖ సిబ్బంది వాపోతున్నారు. బార్ల ఆశావహులకు ఎక్సైజ్ శాఖ అంటే భయం లేకపోవడమే, దరఖాస్తులు రాకపోవడానికి కారణమనే వింత వాదనను పై అధికారులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇన్చార్జి ఈఎస్ ను బదిలీ చేసిన ప్రభుత్వం, ఇద్దరు సీఐలపై కూడా రంగం సిద్ధ చేసి ఇంకో అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.. జిల్లాలో మిగిలినన 15 బార్లకు రీ నోటిఫికేషన్ జారీ చేస్తామని, అప్పుడు కూడా. స్పందన లేకపోతే చర్యలు తప్పవనే సంకేతాలు కమిషనరేట్ నుంచి వచ్చిన సమాచారం. జిల్లా కేంద్రం బాపట్లలో కూడా ఒక్క బార్ కు కూడా లాటరీ తీయడం జరగలేదని, ఇది కచ్చితంగా పేలవ పనితీరుకు నిదర్శనమని ఉన్నతాధికారులు వ్యాఖ్యనించినట్లు తెలుస్తోంది.
మార్చి నెలలో అప్పటి ఈఎస్ దేవదత్తు సరెండర్
పనితీరు ప్రామాణికంగా సూపరిటెండెంట్ ఎక్సైజ్ విధులు నిర్వహిస్తున్న దేవదత్తును ఈ ఏడాది మార్చిలో కలెక్టర్ వెంకటమురళి సరెండర్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇన్చార్జి ఈఎస్ వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇదేం తీరు..
ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తు రుసుంతోపాటు, లైసెన్సు ఫీజు కూడా భారీగా ఉండడమే ఆశావహుల వెనకంజకు కారణమనేది బార్ల వ్యాపారంలో ఏళ్ల తరబడి ఉన్న వారి అభిప్రాయం. బార్లు ఏర్పాటు చేసే ప్రాంతాల జనాభా వారీగా చూసుకున్నా ఈ రుసుంలతో ఆర్థికంగా వర్కవుట్ కాదనే లెక్కలతోనే దరఖాస్తు చేయలేదనేది బహిరంగ రహస్యం. బార్ల ఆశావహులు లాభనష్టాల బేరీజు లెక్కలతోనే మిన్నకుండిపోయారు తప్పితే.. ఇందులో ఎక్సైజ్ శాఖ తప్పిదమేమిటో అర్థం కావడం లేదని సిబ్బంది. వాపోతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు
250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..
For More AP News And Telugu News