Share News

AP News: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం.. ఎప్పుడంటే..

ABN , Publish Date - Feb 05 , 2025 | 05:58 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులు, విశాఖ పంచగ్రామాల సమస్య సహా అనేక అంశాలపై చర్చించనున్నారు.

AP News: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం.. ఎప్పుడంటే..
AP Cabinet Meet

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మంత్రిమండలి (Cabinet) గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఏపీకి సంబంధించి పలు అంశాలపై మంత్రిమండలిలో కీలక చర్చ జరగనుంది. ప్రధానంగా వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ చేయబడిన 22-ఏ భూముల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. విశాఖ పంచగ్రామాల సమస్యపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుటికే ఆ భూములకు సంబంధించి ఏపీ సర్కార్ పరిష్కారం చూపించింది. అయితే స్థానికులకు ప్రత్యామ్నాయంగా అదే విలువ కలిగిన భూముల కేటాయించాలని చంద్రబాబు సర్కార్ యోచిస్తోంది. దానిపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

AP High Court: విజయసాయి కుమార్తెకు హైకోర్టు షాక్


ఎస్ఐపీబీలో ఆమోదించిన రూ.44.776 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదముద్ర పడే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,580 మంది యువత ఉద్యోగ అవకాశాలు పొందనున్నారు. ఈ నెలాఖరులో జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై క్యాబినెట్ మీటింగ్ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. ఏపీలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుపైనా క్యాబినెట్‌లో మంత్రులు చర్చించే అవకాశం కనిపిస్తోంది. క్యాబినెట్ సమావేశాల్లో పలు అంశాలకు మంత్రిమండలి ఆమోదముద్ర పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

YS Jagan: మళ్లీ అధికారంలోకి వస్తాం.. 30 ఏళ్లు ఏలుతాం.. జగన్ జోస్యం

Leopard: పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన చిరుత.. ఆ తర్వాత రైతు ఏం చేశాడంటే..

Updated Date - Feb 05 , 2025 | 05:59 PM