Share News

AP Cabinet Meet: మరోసారి భేటీ కానున్న ఏపీ క్యాబినెట్.. ప్రధానంగా చర్చించే అంశాలు ఏంటంటే..

ABN , Publish Date - Mar 07 , 2025 | 04:06 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి మరోసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లు సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

AP Cabinet Meet: మరోసారి భేటీ కానున్న ఏపీ క్యాబినెట్.. ప్రధానంగా చర్చించే అంశాలు ఏంటంటే..
AP Cabinet Meet

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి మరోసారి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయ్యే మంత్రిమండలి మొత్తం 14 ప్రధాన అంశాలు అజెండాగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి చట్టసవరణ బిల్లులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే వివిధ సంస్థలకు భూ కేటాయింపులపైనా క్యాబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది.


మరోవైపు కుప్పంలో డిజిటల్ హెల్త్ కేంద్రం ఏర్పాటుకూ గ్రీన్ సిగ్నల్ పడనుంది. వైద్యారోగ్యశాఖలో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకీ పచ్చజెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. 2024- 29 ఏపీ పర్యాటక విధానంపైనా మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల కాలంలోనే ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన క్యాబినెట్ మంత్రులు వివిధ అంశాలకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Naga Babu MLC nomination: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్.. బలపరిచిన లోకేష్

AP Government: ఆ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

Updated Date - Mar 07 , 2025 | 04:10 PM