Chandra Grahan 2025: బాబోయ్.. అర్ధరాత్రి తలపై కుంపటి పెట్టుకుని..
ABN , Publish Date - Sep 09 , 2025 | 02:45 PM
గుంటూరు జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి అఘోర చేసిన పూజలు.. ఆ ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. బాబోయ్ క్షుద్రపూజలు అంటూ బెంబేలెత్తిపోతున్నారు.
అమరావతి, సెప్టెంబర్ 09: గుంటూరు జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి అఘోర చేసిన పూజలు.. ఆ ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. బాబోయ్ క్షుద్రపూజలు అంటూ బెంబేలెత్తిపోతున్నారు. అయితే, అవి క్షుద్రపూజలు కాదని.. దైవ పూజలంటూ సదరు అఘోరి చెబుతున్నారు. మరి వాళ్లు ఏం పూజలు చేశారో ఏమో గానీ.. స్థానికులు మాత్రం గజగజ వణికిపోతున్నారు. ఇంతకీ ఈ పూజలు ఎక్కడ చూశారు.. ఏం చేశారు.. ప్రజలెందుకు భయపడుతున్నారు.. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
అసలే చంద్రగ్రహణం.. ఆపై అర్ధరాత్రి వింత పూజలు.. తలపై కుంపటి పెట్టుకుని మంత్రాలు జపిస్తే.. అది చూసిన జనాల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భయంతో గజగజ వణికిపోవాల్సిందే. ఇక్కడ కూడా అదే జరిగింది. గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో శివాలయం వద్ద కొందరు చేసిన పూజలు.. అక్కడి స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.
చంద్రగ్రహణం రోజున రెడ్డిపాలెం శివాలయం వద్ద అఘోర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో శ్రీనివాసరావు మరికొందరు తలపై కుంపటి పెట్టుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది చూసిన జనాలు భయంతో హడలిపోయారు. క్షుద్ర పూజలు చేసినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై అధికారులకు కంప్లైంట్ కూడా చేశారు. అయితే, తాము క్షుద్రపూజలు చేయలేదని అఘోర శ్రీనివాసరావు చెబుతున్నారు. మృత్యుంజయ హోమం చేశాడని చెప్పుకొస్తున్నారు. అయితే, స్థానిక జనాలు మాత్రం క్షుద్ర పూజలు చేస్తున్నారని.. ఇలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Also Read:
Vangalapudi Anitha: భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న హోంశాఖ మంత్రి
DK Shivakumar: ఆశ లేకుంటే జీవితం లేదు.. సీఎం పదవిపై డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
For More Andhra Pradesh News and Telugu News..