Share News

Nara Lokesh Meeting: ఏపీ విద్యాసంస్కరణలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:25 AM

ఏపీ విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని...

Nara Lokesh Meeting: ఏపీ విద్యాసంస్కరణలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు

  • ‘పాల్‌’తో విద్యార్థుల అభ్యసన స్థాయి పెరిగింది

  • మంత్రి లోకేశ్‌తో భేటీలో ప్రొఫెసర్‌ మైఖేల్‌ క్రెమర్‌ వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఏపీ విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని నోబెల్‌ బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త, యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో ప్రొఫెసర్‌ మైఖేల్‌ క్రెమర్‌ కొనియాడారు. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో ఉండవల్లిలోని నివాసంలో ఆయన సమావేశమయ్యారు. యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో బృందం నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఎడ్‌టెక్‌ సామర్థ్యం పెరిగిందన్నారు. పర్సనలైజ్డ్‌ అడాప్టివ్‌ లెర్నింగ్‌ (పాల్‌) కార్యక్రమాన్ని ఉపయోగించిన విద్యార్థులు 17 నెలల్లోనే మిగతా పాఠశాలల విద్యార్థుల కంటే 2.25 రెట్లు అభ్యసన పురోగతిని సాధించారని వివరించారు. ‘పాల్‌’ వినియోగంలో ఏపీ ప్రథమ స్థానంతో దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 2018లో 60 పాఠశాలల్లో ప్రారంభమైన ‘పాల్‌’ కార్యక్రమం ప్రస్తుతం 26 జిల్లాల్లోని 1,224 పాఠశాలలకు విస్తరించి, 3.25 లక్షల మందికి పైగా విద్యార్థులకు చేరువైందని తెలిపారు.


తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!

పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 04 , 2025 | 03:25 AM