Palakondrayudu Passes Away: మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు కన్నుమూత
ABN , Publish Date - May 07 , 2025 | 04:42 AM
అన్నమయ్య జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే, రాజంపేట మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు (79) బెంగళూరులో కన్నుమూశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంతాపం
రాయచోటి, మే 6(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు మాజీ సభ్యుడు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు (79) శ్వాసకోశ సమస్యతో మంగళవారం బెంగళూరులో కన్నుమూశారు. నాలుగున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న ఆయన రాయచోటి నియోజకవర్గంపై చెరగని ముద్ర వేశారు. గురువారం ఉదయం 9 గంటలకు రాయచోటి పట్టణంలోని పాలకొండ్రాయుడు సినిమా థియేటర్ల సమీపంలోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా.. పాలకొండ్రాయుడు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. పాలకొండ్రాయుడు కుమారులను చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు.