AP News: శ్రీధర్ రెడ్డీ.. నీకు మతి భ్రమించిందా ఏంది..
ABN , Publish Date - Oct 20 , 2025 | 01:23 PM
‘రాష్ట్ర పురోభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అవాకులు.. చెవాకులు.. పేలుతున్నావు.. మతిభ్రమించిందా..? అంటూ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు.
పుట్టపర్తి: ‘రాష్ట్ర పురోభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chief Minister Chandrababu Naidu)పై అవాకులు.. చెవాకులు.. పేలుతున్నావు.. మతిభ్రమించిందా..? అంటూ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి(Former Minister Palle Raghunatha Reddy) మండిపడ్డారు. ‘మానసిక సమస్య ఉంటే చెప్పు.. వైద్యం చేయిస్తా..’ అంటూ ఎద్దేవా చేశారు.
అనంతపురంలోని తన నివాసంలో పల్లె ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్‌మోహన్‌రెడ్డిని వదిలి, అభివృద్ధి కోసం కష్టపడుతున్న చంద్రబాబునాయుడుపై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. ప్రశాంతంగా వ్యాపారాలు చూసుకోవాలనీ, వైసీపీ వచ్చేదీలేదు, చచ్చేదీలేదని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పుట్టపర్తి నియోజకవ్గంలో ఎంత అభివృద్ధి చేశామో వైసీపీ కార్యకర్తలనే అడిగి తెలుసుకోవాలన్నారు.

పుట్టపర్తి(Puttaparthi)లో అసాంఘిక కార్యకలాపాలను సహించేదిలేదనీ, ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ‘నీ అవినీతి గురించి చెప్పమంటావా.. సాయిటవర్ నుంచి అంగన్‌వాడీ వర్కర్ పోస్టుల అమ్మకాల వరకు నీ అక్రమాల చిట్టా విప్పాలా’ అంటూ ధ్వజమెత్తారు. నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి
Read Latest Telangana News and National News