Former Fire Safety DG Sanjay: ఏసీబీ కస్టడీకి ఏపీ ఫైర్ సేఫ్టీ మాజీ డీజీ సంజయ్
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:36 AM
ఆంధ్రప్రదేశ్ ఫైర్ సేఫ్టీ మాజీ డీజీ సంజయ్‌ని ఏసీబీ కస్టడీకి తీసుకుంది. జిల్లా జైలు నుంచి ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ACB అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ సంజయ్‌ను విచారిస్తోంది.
విజయవాడ, సెప్టెంబరు 2: ఆంధ్రప్రదేశ్ ఫైర్ సేఫ్టీ మాజీ డీజీ సంజయ్‌ని మూడ్రోజులపాటు ఏసీబీ కస్టడీకి తీసుకుంది. జిల్లా జైలు నుంచి ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ACB అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ సంజయ్‌ను విచారిస్తోంది. వైద్య పరీక్షలు చేసిన తర్వాత సంజయ్‌ను విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇవాళ (మంగళవారం) సాయంత్రం 5 గంటల వరకు ఏసీబీ విచారణ కొనసాగే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అవగాహన సదస్సుల పేరిట సొమ్ము దోపిడీ, అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, యాప్ అభివృద్ధి నిర్వహణ పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలు నిడగట్టు సంజయ్ మీద ఉన్నాయి. ఐపీఎస్ అధికారి, నాటి సీఐడీ, అగ్నిమాపక శాఖల డీజీ అయిన నిడగట్టు సంజయ్.. ఈ కేసులో ఏ1 నిందితుడుగా ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News