Share News

Floodwaters Recede in Krishna and Godavari: కృష్ణా, గోదావరి వరద తగ్గుముఖం

ABN , Publish Date - Aug 25 , 2025 | 03:27 AM

కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కృష్ణానదిలో నాగార్జునసాగర్‌ నుంచి 3.60 లక్షల క్యూసెక్కులు పులిచింతలకు..

Floodwaters Recede in Krishna and Godavari: కృష్ణా, గోదావరి వరద తగ్గుముఖం

విజయవాడ, పోలవరం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కృష్ణానదిలో నాగార్జునసాగర్‌ నుంచి 3.60 లక్షల క్యూసెక్కులు పులిచింతలకు వస్తోంది. పులిచింతల నుంచి 3.33 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. పాలేరు నుంచి 706 క్యూసెక్కులు, కీసర నుంచి 4738 క్యూసెక్కులు కలిపి మొత్తంగా ప్రకాశం బ్యారేజీకి 3,83,916 క్యూసెక్కులు వస్తుండటంతో గేట్లన్నీ ఎత్తి 3,65,725 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరిలో భద్రాచలం వద్ద నీటిమట్టం 32.60అడుగులకు తగ్గింది. పోలవరం 48 గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు

రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

For More National News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 03:27 AM