Share News

Farmers Queue Up for Urea: యూరియా కోసం రైతుల బారులు

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:18 AM

గత కొద్ది రోజులుగా యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి సొసైటీకి..

Farmers Queue Up for Urea: యూరియా కోసం రైతుల బారులు

గత కొద్ది రోజులుగా యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి సొసైటీకి యూరియా వచ్చిందని తెలిసింది. దీంతో సొసైటీ పరిధిలోని లంకపల్లి, దాలిపర్రు, యండకుదురు, మల్లాయిచిట్టూరు, పూషడం గ్రామాల రైతులు బుధవారం ఉదయాన్నే సొసైటీకి చేరుకున్నారు. వందలాది మంది రావడంతో ఆ ప్రాంతమంతా రైతులతో కిక్కిరిసిపోయింది. పీఏసీఎస్‌ సిబ్బంది గేట్లు మూసేశారు. రైతులు ఎగబడటంతో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. సొసైటీకి 425 బస్తాలే రావటంతో తహసీల్దార్‌ ఆదేశాల మేరకు ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. గ్రామంలోని గ్రోమోర్‌ సెంటర్‌ వద్ద కూడా రైతులు బారులు తీరారు. ఈ సెంటర్‌కు 555 బస్తాలు రాగా.. ఒక్కో రైతుకు ఒక బస్తా పంపిణీ చేశారు.

- ఘంటసాల, ఆంధ్రజ్యోతి


తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!

పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 04 , 2025 | 03:19 AM