Fake Liquor CaseL: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:55 PM
ఏపీ హాట్ టాపిక్ గా మారిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను పోలీసుల కస్టడీకి ఇస్తూ ఎన్టీఆర్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 24 నుంచి అక్టోబరు 30 వరకు ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన నకిలీ(Fake Liquor Case) మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అద్దేపల్లి జనార్దన్, జగన్ మోహన్ ను ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి ఇస్తూ ఎన్టీఆర్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 24 నుంచి అక్టోబరు 30 వరకు ఏడు రోజులపాటు నిందితులను పోలీస్ కస్టడీకి ఇస్తూ జిల్లా కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో ఏ-1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ ను ఈనెల 24న అదుపులోకి తీసుకుని 30న తిరిగి జైలు అధికారులకు అప్పగించనున్నారు. కాగా, ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో అద్దేపల్లి జనార్దన్ ఉన్నాడు. అలాగే విజయవాడ జైల్లో ఉన్న ఏ-2 జగన్ మోహన్ ను కూడా పోలీసులు విచారించనున్నారు. అతడినీ ఈనెల 24 నుంచి 30 వరకు ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.
ఇవీ చదవండి..
వార్సాలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!
హాంబర్గ్‌లో ఘనంగా శ్రీనివాసుడి కళ్యాణోత్సవం