10th Class Student: దారుణం.. విద్యార్థినిని గర్భవతిని చేసిన కరస్పాండెంట్
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:40 PM
పదో తరగతి చదువుతున్న విద్యార్థిపై స్కూల్ కరస్పాండెంట్ లైంగిక దాడి చేశారు. ఈ విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది.
అమలాపురం, జులై 29: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో దారుణం చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థినిని ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ షాజీ జయరాజు గర్భవతిని చేశాడు. దీంతో రాయవరం పోలీసులను కుటుంబసభ్యులు ఆశ్రయించారు. దీంతో స్కూల్ కరస్పాండెంట్ షాజీ జయరాజుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
జయరాజు ఓ ప్రైవేట్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఆ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆరోగ్య పరిస్థితిలో కీలక మార్పులు వచ్చాయి. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. గర్భవతి అని తేలింది. దీంతో అసలు విషయాన్ని తల్లిదండ్రులకు ఆ విద్యార్థిని వివరించింది. అయితే ఈ లైంగిక దాడి ఘటనపై ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ స్కూల్ కరస్పాండెంట్ షాజీ జయరాజు బెదించారని బాధితురాలు వెల్లడించింది. ఈ మేరకు బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.
ఈ ఘటనను మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఆ క్రమంలో ప్రైవేట్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగాయి. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి సలీం బాషా స్పందించారు. బాలికను గర్భవతిని చేసిన ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ షాజి జయరాజ్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే ఈ ప్రైవేట్ స్కూల్‌లో 7వ తరగతి వరకు మాత్రమే తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఉందని తెలిపారు అధికారులు. ఆపై.. అంటే 8, 9, 10 తరగతులు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యార్థులకు సరైన వసతులూ లేవని చెప్పారు. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేంద్రమంత్రి ఫైర్
Read latest AndhraPradesh News And Telugu News