Share News

ఒక్క క్షణంలో.. ఘోరం!

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:54 AM

శంఖవరం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మరొక పది కిలోమీటర్లు పయనిస్తే ఆ కుటుంబం సత్యదేవుని సన్నిధిలో సంతోషంగా ఉండేది. వా రింట సంక్రాంతి సందడి మిగిలేది.

ఒక్క క్షణంలో.. ఘోరం!
శంఖవరం మండలం కత్తిపూడిలో జరిగిన ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహలు

అన్నవరం దైవదర్శనానికి వెళ్తూ ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు..

రెండు కుటుంబాల్లో విషాదం

ఉదయం 7గంటల సమయంలో ప్రమాదం

ముగ్గురి మృతి.. మరో నలుగురికి తీవ్రగాయాలు

కాకినాడ జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై ఘటన

మృతులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాసులు

శంఖవరం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మరొక పది కిలోమీటర్లు పయనిస్తే ఆ కుటుంబం సత్యదేవుని సన్నిధిలో సంతోషంగా ఉండేది. వా రింట సంక్రాంతి సందడి మిగిలేది. దూరం నుంచి వస్తూ గమ్యానికి దగ్గరలోకి వచ్చినా మృత్యు ఒడిలోకి చేరడంతో వారికి విషాదమే మిగిలింది. కాకినాడ జిల్లా శంఖవరం మండ లం కత్తిపూడిలో 16వ నెంబరు జాతీయ రహ దారిపై ఆగిఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొంది. అన్నవరం దైవదర్శనానికి వెళ్తుండగా జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తెల్లవారుజామునే బయలుదేరి..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టౌన్‌కి చెం దిన చవ్వాకుల శ్యాంప్రసాద్‌, అతని బావమరిది కరింశెట్టి శివన్నారాయణ, కరింశెట్టి శివన్నారాయణ భార్య దివ్య, కరీంశెట్టి సత్యనాగమధు, శ్యాంప్రసాద్‌ భార్య చవ్వాకుల ప్రసన్న, తల్లి అమ్మాజీ, కారు డ్రైవర్‌ నిమ్మగడ్డ ధనుష్‌ కలిసి శనివారం తెల్లవారుజామున అన్నవరం రావడా నికి ఉదయం 4-5 గంటల మధ్యలో కారులో బయలుదేరారు. వీరి వాహనం ఉదయం 7 గం టల సమయంలో అన్నవరానికి దగ్గర్లోనే పది కిలోమీటర్ల ముందు కత్తిపూడి వద్దకు చేరు కుంది. అక్కడ ఆగిఉన్న లారీని వేగంగా ఢీకొం ది. ఈ ఘటనలో చవ్వాకుల శ్యాంప్రసాద్‌(50), కరింశెట్టి శివన్నారాయణ (38), కరింశెట్టి దివ్య(30) అక్కడికక్కడే మృతి చెందగా మిగిలినవారు తీవ్రంగా గా యపడ్డారు.శ్యాంప్రసాద్‌ భార్య ప్రసన్న, తల్లి అమ్మా జీ అపస్మారక స్థితిలో వేర్వే రు ఆస్పత్రుల్లో చికిత్స పొం దుతున్నారు. డ్రైవర్‌ ధనుష్‌ మాత్రం స్వల్పంగా గాయప డ్డాడు. ఈ ప్రమాదం జరిగిన తీరు చాలా ఘోరంగా ఉంది. వీరు ప్రయాణించే ఎర్టిగా కారు నుజ్జునుజ్జవడంతోపాటు రహదారులన్నీ రక్తమోడి చూపరులు చలించిపోయా రు. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణం తెలి యనప్పటికీ నిద్రమత్తుగానీ, లారీని గమనించక పోవడంగానీ అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

క్షతగాత్రులను స్థానికుల సహాయంతో తుని, ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రులకు తీసుకెళ్లారు. ప్రత్తిపాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరీంశెట్టి శివనారాయణ మృతి చెందగా అమ్మాజీ, సత్యనాగమధులను మెరుగైన వైద్యంకోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆగిన లారీయే కారణం

జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలను ఢీకొట్టడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆగి ఉన్న లారీలపై పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో ఇష్టానుసారంగా లారీలను నిలిపివేస్తున్నారు. దీంతో ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత పడడంతోపాటు వందల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు.

భీమవరంలో విషాదఛాయలు

భీమవరం క్రైం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): చవ్వాకుల శ్యాంప్రసాద్‌ మృతితో భీమవరంలోని ఆయన నివాసం వద్ద విషాధఛాయలు అలముకున్నాయి. అతడు భీమవరం గన్నాబత్తుల వారివీధిలో ఉంటున్నాడు. ఆయనకు సంతానం లేరు. యనమదుర్రులో వ్యవసా యం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతని బా వమరిది అయిన కరింశెట్టి శివన్నారాయణ కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలానికి చెందినవాడు. ఆయన కూడా ప్రస్తుతం భీమవరంలోనే ఉంటున్నారు. అతనికి కూడా సంతానం లేనట్లుగానే బంధువులు తెలిపారు.

మధ్యాహ్నానికి వచ్చేస్తానని వెళ్లి..

అన్నవరం దేవాలయానికి వెళ్లి దర్శన అ నంతరం మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తామని వారి కుటుంబసభ్యులకు ముందురోజే శ్యాంప్రసాద్‌ చెప్పాడు. ఇప్పుడు ఆయనతోపాటు చెల్లి, బావ కూడా ముగ్గురు మృతి చెందడంతో వీరి కుటుంబీకులు దిగ్ర్భాంతికి గురయ్యారు. శ్యాంప్రసాద్‌కు అన్నదమ్ములు ముగ్గురుకాగా, పెద్దవారైన మోహన్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రెండో సోదరుడు తాతాజీ 20ఏళ్ల క్రితం కృష్ణా పుష్కరాల్లో గల్లంతు కావడంతో అప్పటినుంచి తల్లి బెంగతోనే ఉన్నారు. మూడో సోదరుడు శ్యాంప్రసాద్‌ అందరినీ చూసుకుంటున్నాడు. దీంతో ఆఇంట విషాదం అలుముకుంది.

Updated Date - Jan 12 , 2025 | 12:54 AM