ONGC Gas Leak: ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా లీకైన గ్యాస్.. చివరికి..
ABN , Publish Date - Mar 12 , 2025 | 08:16 PM
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం కేశనపల్లి-గొల్లపాలెం మధ్య ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓఎన్‌జీసీ గ్యాస్ గ్యాథరింగ్ స్టేషన్‍లో లీకేజీ జరిగి సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.

అంబేడ్కర్ కోనసీమ: జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మల్కిపురం మండలం కేశనపల్లి-గొల్లపాలెం మధ్య ఓఎన్‌జీసీ గ్యాస్ లీకై తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ గ్యాథరింగ్ స్టేషన్‍లో ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయ్యింది. ఆ సమయంలో పదుల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది అక్కడ ఉన్నారు. గ్యాస్ లీక్ కావడంతో ప్రమాద స్థలం నుంచి కొంతమంది పరుగులు తీయగా.. మరికొంతమంది లీకేజీని అరికట్టే ప్రయత్నం చేశారు.
అయితే వాసన గాఢంగా రావడంతో అది పీల్చి తొమ్మిది మంది స్పృహ కోల్పోయారు. బాధితులను తోటి సిబ్బంది హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, భారీగా గ్యాస్ వ్యాపించి స్థానికులు, సమీప గ్రామాల ప్రజలు సైతం ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న అమలాపురం ఆర్డీవో కొత్త మాధవి, రాజోలు సీఐ టీవీ నరేశ్ కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీజేకీపై దర్యాప్త చేపట్టారు. కాగా, గ్యాస్ లీక్ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళకు గురవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Car Accident: ఏపీకి చెందిన కేంద్ర మంత్రి కారుకు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే..
Kadambari Jatwani Case: ముగ్గురు ఐపీఎస్ అధికారులకు భారీ షాక్ ఇచ్చిన కూటమి సర్కార్..