జనసేన ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి నాదెండ్ల
ABN , Publish Date - Mar 01 , 2025 | 12:36 AM
పిఠాపురం/పిఠాపురం రూరల్, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం వేదికగా జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పిఠాపురం మండలం చిత్రాడ శివారు ఎస్‌బీ వెంచర్స్‌లో మార్చి 14న జరిగే జనసేన ఆవిర్భావ వేడుకల సభాస్థలిని ఆయన శుక్రవారం రాత్రి పరిశీలించారు. ప్రధా న వేదిక నిర్మాణం, గ్యాలరీ
పిఠాపురం/పిఠాపురం రూరల్, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం వేదికగా జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పిఠాపురం మండలం చిత్రాడ శివారు ఎస్‌బీ వెంచర్స్‌లో మార్చి 14న జరిగే జనసేన ఆవిర్భావ వేడుకల సభాస్థలిని ఆయన శుక్రవారం రాత్రి పరిశీలించారు. ప్రధా న వేదిక నిర్మాణం, గ్యాలరీల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీకి సూచనలు చేశారు. మహిళలు ఏ ఇబ్బంది లేకుండా నేరుగా సభాస్థలికి చేరుకునే ఏర్పాట్లు చేయాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది పార్టీ శ్రేణులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. సభ కారణంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం అనంతరం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కుడా చైర్మన్ తుమ్మల బాబు, జనసేన పిఠాపురం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కల్యాణం శివ శ్రీనివాస్, నాయకులు వై.శ్రీనివాస్, బోడపాటి శివదత్, తలాటం సత్య, మండలి రాజేష్, తోట సత్యనారాయణ, చల్లా లక్ష్మీ, మురాలశెట్టి సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆవిర్భావ వేడుకల సభ నిర్వహణ ఏర్పాట్లుకు శనివారం సాయం త్రం 4గంటలకు భూమి పూజ జరగనున్నది.