Nara Lokesh: గుడ్ న్యూస్ చెప్పిన లోకేశ్.. ఇక ప్రతి ఏటా డీఎస్సీ..
ABN , Publish Date - Jun 06 , 2025 | 08:47 PM
టీచర్ల బదిలీలు, పదోన్నతులు అన్ని పారదర్శకంగా నిర్వహిస్తామని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాలుగు వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు చెప్పారు.
అమరావతి, జూన్ 06: నేటి నుంచి ప్రారంభమైన మెగా డీఎస్సీ పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విద్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులు అన్ని పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాలుగు వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏపీలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో నిరక్షర్యాసులు ఎంత మందంటే..
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ 81 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారన్నారు. అంటే రాష్ట్ర జనాభాలో సుమారు 19 శాతం ఉన్నారన్నారు. వీరంతా 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారేనని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా వయోజన విద్యలో ఆంధ్రప్రదేశ్ స్థానం తక్కువగా ఉండడం దురదృష్టకరమన్నారు. దీనిపై మిషన్ మోడ్‌లో చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
ఇక వయోజన విద్యను ప్రోత్సహించేందుకు అక్షర ఆంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు ఉల్లాస్ కార్యక్రమం కింద 3.95 లక్షల మంది పరీక్ష రాస్తే.. 90 శాతం మంది పాస్ కావడం పట్ల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యలో పాఠశాల విద్యాశాఖ నుంచి అంకితభావం గల వారి సేవలను వయోజన విద్యకు మళ్లించాలని సూచించారు. అక్షరాస్యతలో ఏపీ టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్నదే తాను ఆశిస్తున్న లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
తక్షణ లక్ష్యాలుగా వయోజన విద్య మిషన్ తక్షణమే ప్రారంభించడం.. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడం.. అక్షరాస్యత పరీక్షల సంఖ్య పెంచడాన్ని నిర్దేశించికొన్నట్లు మంత్రి నారా లోకేశ్ ఈ సందర్బంగా ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో బనకచర్లకు టెండర్ల ఆహ్వానం: సీఎం చంద్రబాబు
తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోపై దాడి.. స్వల్ప గాయాలు
For AndhraPradesh News And Telugu News