Share News

Digital Bharat Fund : టవర్‌ ఏదైనా సెల్‌ సిగ్నల్‌ పక్కా

ABN , Publish Date - Jan 18 , 2025 | 06:12 AM

రాష్ట్రంలో మారుమూల, గిరిజన గ్రామాల్లో సర్వీ సు ప్రొవైడర్‌, అక్కడున్న సెల్‌టవర్‌తో సంబం ధం లేకుండా మొబైల్‌ వినియోగదారులు ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌....

 Digital Bharat Fund : టవర్‌ ఏదైనా సెల్‌ సిగ్నల్‌ పక్కా

  • రాష్ట్రంలో ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌

  • డీవోటీ ఏడీజీ రాజారెడ్డి వెల్లడి

విజయవాడ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మారుమూల, గిరిజన గ్రామాల్లో సర్వీ సు ప్రొవైడర్‌, అక్కడున్న సెల్‌టవర్‌తో సంబం ధం లేకుండా మొబైల్‌ వినియోగదారులు ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌ ద్వారా సిగ్నల్స్‌ను పొందవచ్చని భారత టెలికం శాఖ అదనపు డీజీ రాజారెడ్డి తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్స్‌ సమస్యను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ భారత్‌ నిధి(డీబీఎన్‌) ఏర్పాటు చేసిందని వివరించారు. ఇందులో బీఎ్‌సఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, జియో సర్వీసు ప్రొవైడర్లు భాగస్వాములుగా ఉన్నాయన్నారు. డీబీఎన్‌, సంచార్‌సాథి మొబైల్‌ యాప్‌లను కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలో శుక్రవారం ప్రారంభించిన కార్యక్రమంలో వర్చువల్‌ గా పాల్గొన్న రాజారెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. డీబీఎన్‌తో బీఎ్‌సఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, జియో వినియోగదారులకు మేలు జరుగుతుందన్నారు. ఇంతకుముందు ఉన్న యూనివర్స ల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ను కేంద్రం డిజిటల్‌ భారత్‌ నిధిగా మార్పు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో 1,370 బీఎ్‌సఎన్‌ఎల్‌, 197 ఎయిర్‌టెల్‌, 521 జియో సెల్‌టవర్లు ఉన్నాయని వెల్లడించా రు. రాష్ట్రంలో బీఎ్‌సఎన్‌ఎల్‌ సామర్థ్యాన్ని పెంచడానికి 1,300 టవర్లు ఏర్పాటు చేస్తున్నామన్నా రు. కాగా, సంచార్‌ సాథి యాప్‌ను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. దీని ద్వారా ఫోన్లు పోగొట్టుకున్నా, అంతర్జాతీయ కాల్స్‌ బ్లాక్‌ చేయాలన్నా సులభంగా చేసుకోవచ్చు.

Updated Date - Jan 18 , 2025 | 06:12 AM