Women Empowerment: కొత్త జిల్లాలకు మహిళా ప్రముఖుల పేర్లు పెట్టాలి
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:18 AM
కర్నూలు జిల్లా కేంద్రంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం నరసం సప్తమ వార్షికోత్సవంగా సందర్భంగా రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు.

నరసం రాష్ట్ర సదస్సులో వక్తల విజ్ఞప్తి
కర్నూలు కల్చరల్, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారత దిశగా ముందుకు వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కొన్ని జిల్లాలకైనా ఆ ప్రాంత మహిళా ప్రముఖుల పేర్లు పెట్టాలని నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) 7వ రాష్ట్ర సదస్సులో పలువురు వక్తలు విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం నరసం సప్తమ వార్షికోత్సవంగా సందర్భంగా రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. కొత్త జిల్లాలకు స్థానిక మహిళా ప్రముఖుల పేర్లు పెట్టడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సాహిత్య రంగంలో 50 శాతం పదవులు మహిళలకు కేటాయించాలని కోరారు. అలాగే ఉగాది, గిడుగు, గురజాడ పురస్కారాలను పునరుద్ధరించి, మహిళలకు అవార్డులు అందజేయాలని కోరారు. హంస అవార్డుల్లో 50 శాతం మహిళలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా, మహిళల సంరక్షణకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, క్లస్టర్ యూనివర్సిటీ వీసీ డీవీఆర్ సాయిగోపాల్, రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు, నరసం వ్యవస్థాపక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తేళ్ల అరుణ, పాతూరి అన్నపూర్ణ పాల్గొన్నారు.
Also Read:
గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..
భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..
For More National News and Telugu News..