గుడి వద్ద సీఐడీ డీఎస్పీ మృతదేహం
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:47 AM
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ గుడి వద్ద ఒక వ్యక్తి విగత జీవిగా పడిఉన్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆరా తీయగా ఆయన డీఎస్పీ అని తెలిసింది. సీఐ బాజీలాల్ తెలిపిన వివరాల ప్రకారం..

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ గుడి వద్ద ఒక వ్యక్తి విగత జీవిగా పడిఉన్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆరా తీయగా ఆయన డీఎస్పీ అని తెలిసింది. సీఐ బాజీలాల్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీపురం పరిధిలోని ఎస్‌ఆర్‌ఎంటీ గోదాము సమీపంలోని సాయిబాబా గుడి దగ్గరలో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికుల నుంచి గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం వచ్చింది.
వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని ఫొటోను పోలీసు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన కొద్దిసేపటికే ఆయన సీఐడీ డీఎస్పీ అని తెలిసింది. కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బి.నాగరాజు(54) 1995లో ఎస్‌ఐగా సర్వీసులో చేరి డీఎస్పీ స్థాయికి ఎదిగారు. ఏడాది క్రితం బదిలీపై రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. లాడ్జిల్లో ఉంటూ విధులకు హాజరయ్యేవారు.
డిసెంబరు నుంచి మెడికల్ లీవులో ఉన్నారు. ఈ నెల 2న రాజమహేంద్రవరం వెళుతున్నానని కర్నూలు నుంచి వచ్చారు. ఇక్కడ ఓ లాడ్జిలో ఉంటూ 10వ తేదీ వరకూ కుటుంబ సభ్యులకు ఫోనులో అందుబాటులో ఉన్నారు. ఆ రోజు రాత్రి 10 గంటలకు చివరిగా మాట్లాడారు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.
హైదరాబాద్‌లో ఉంటున్న నాగరాజు కుమారుడు వంశీకృష్ణ గురువారం ఉదయం రాజమహేంద్రవరం వచ్చి ఆరా తీయగా ఆఫీ్‌సకి రావడం లేదని చెప్పారు. వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన ఫోటోను సీఐడీ సిబ్బంది గుర్తించి ప్రకాశం నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాజీలాల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
Read More Business News and Latest Telugu News