Share News

Subbarao Panigrahi Wife: సుబ్బారావు పాణిగ్రాహి సతీమణి కన్నుమూత

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:08 AM

శ్రీకాకుళం గిరిజన సాయుధ రైతాంగ పోరాటంలో బడుగు, బలహీనవర్గాల కోసం పోరాటం చేసి అశువులు బాసిన విప్లవ

Subbarao Panigrahi Wife: సుబ్బారావు పాణిగ్రాహి సతీమణి కన్నుమూత

పలాస రూరల్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం గిరిజన సాయుధ రైతాంగ పోరాటంలో బడుగు, బలహీనవర్గాల కోసం పోరాటం చేసి అశువులు బాసిన విప్లవ కవి, కామ్రేడ్‌ సుబ్బారావు పాణిగ్రాహి సతీమణి సురేఖ పాణిగ్రాహి(83) గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె గత కొంత కాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన సుబ్బారావు పాణిగ్రాహి 1968లో జరిగిన శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాటంలో మృతి చెందారు. అప్పటి నుంచి సురేఖ పాణిగ్రాహి.. పోరాటాల్లో పాల్గొనకపోయినా తన భర్త అడుగుజాడలు, సైద్ధాంతిక భావాలను అర్థం చేసుకుంటూ జీవనం సాగించారు. సురేఖ పాణిగ్రాహి మృతి పట్ల సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీతో పాటు వివిధ విప్లవ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయని బంధువులు చెప్పారు. అనంతరం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో సంతాప సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‏లు

ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

For More National News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:08 AM