Collector Shyam Prasad : కారులో వెళ్లి.. బైక్ ఎక్కి.. కొండపైకి నడిచి!
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:33 AM
మూడు కిలోమీటర్లు నడిచి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ శనివారం ఏజెన్సీలో పర్యటించారు.

‘మన్యం’లో పర్యటించిన కలెక్టర్
నాలుగు కిలోమీటర్లు కారులో వెళ్లి.. బైక్‌పై ఒక కిలోమీటరు ప్రయాణించి.. మూడు కిలోమీటర్లు నడిచి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ శనివారం ఏజెన్సీలో పర్యటించారు. మక్కువ మండలం నంద గ్రామంలో సంతను పరిశీలించి, గిరిజనులతో మాట్లాడారు. వ్యాపారులు విక్రయిస్తున్న వస్తువులను పరిశీలించారు. అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిశిఖర గ్రామం లొద్ద చేరుకున్నారు. గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. వారి పంటలు, అటవీ ఉత్పత్తులను పరిశీలించారు. గిరిజనుల జీవనశైలిని, జలపాతాలను చూశారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి.. గిరిజనులకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
- పార్వతీపురం, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..