Share News

Divya Deshmukh: దివ్యా దేశ్‌ముఖ్‌ను అభినందనలతో ముంచెత్తిన నారా ఫ్యామిలీ

ABN , Publish Date - Jul 28 , 2025 | 09:02 PM

ఈ ఏడాది ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా దివ్యా దేశ్‌ముఖ్ నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ దివ్యను అభినందనలతో ముంచెత్తారు.

Divya Deshmukh: దివ్యా దేశ్‌ముఖ్‌ను అభినందనలతో ముంచెత్తిన నారా ఫ్యామిలీ

అమరావతి: ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా దివ్యా దేశ్‌ముఖ్ నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు దివ్యకు ఎక్స్ వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం దివ్యకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ.. ఫిడే ప్రపంచ మహిళా చెస్ ఛాంపియన్‌ గ్రాండ్ టైటిల్‌ను దివ్యా దేశ్‌ముఖ్ గెలుచుకున్నారన్నారు. ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలు ఆమె అని కొనియాడారు. ఈ టైటిల్‌ గెలుచుకున్న దివ్యకు ఈ సందర్భంగా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఆటలో కోనేరు హంపీ సైతం తన ప్రతిభ పాటవాలను ప్రదర్శించారని పేర్కొన్నారు. భారతదేశం కన్న ఇద్దరు చురుకైన యువతులను చూసి తాను గర్విస్తున్నానని చెప్పారు. వీరి విజయం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.


మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ..

చెస్ ఆటలో సంచలనం సృష్టించి ఫిడే మహిళా వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న దివ్యా దేశ్‌ముఖ్‌కు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ ఆటలో కోనేరు హంపీ లాంటి దిగ్గజంపై అద్భుతమైన ప్రదర్శనతో దివ్య ఈ విజయం సాధించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన ప్రతీకగా కోనేరు హంపి నిలిచారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని స్పష్టం చేశారు.


సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి స్పందిస్తూ..

మహిళా చెస్ ప్రపంచ కప్ 2025 టైటిల్ గెలుచుకున్న దివ్యా దేశ్ ముఖ్‌ను నారా భువనేశ్వరి అభినందనలతో ముంచెత్తారు. ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగానే కాకుండా.. భారతదేశ 88వ గ్రాండ్‌మాస్టర్‌గా ఎంపికైన ఆమెకు ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దివ్య ధైర్యం, ప్రతిభ, ప్రశాంతత దేశానికి స్ఫూర్తినిచ్చాయన్నారు. భవిష్యత్తులో చెస్ క్రీడలో భారత్ మరింత దూసుకెళ్తుందని నారా భువనేశ్వరి విశ్వాసం వ్యక్తం చేశారు.


మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి స్పందిస్తూ..

ప్రతిష్టాత్మక ఫిడే మహిళా ప్రపంచ కప్‌ను గెలుచుకున్న దివ్యా దేశ్‌ముఖ్‌కు నారా బ్రహ్మణి శుభాకాంక్షలు తెలిపారు. జస్ట్ 19 ఏళ్ల వయస్సులోనే ఆమె ఈ టైటిల్‌ను గెలుచుకున్నారని చెప్పారు. భారత్ చెస్‌ క్రీడకు కోనేర హంపి గ్లోబల్ అంబాసిడర్‌గా ఉన్నారన్నారు. ఈ ఇద్దరినీ చూసి దేశం గర్విస్తుందని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నాగ పంచమి రోజు.. జస్ట్ ఇలా చేయండి..

‘కాలేజీలు ఖాళీ’ అంటూ ప్రచారం.. మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 09:48 PM