నేడు గుంటూరులో కిమ్స్ శిఖర హాస్పిటల్‌ను ప్రారంభించనున్న సీఎం
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:49 AM
గుంటూరు మంగళదాస్ నగర్ రోడ్‌లో బెస్ట్‌ప్రైజ్ సమీపంలో నూతనంగా నిర్మించిన కిమ్స్ శిఖర హాస్పిటల్స్‌ను

గుంటూరు మెడికల్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): గుంటూరు మంగళదాస్ నగర్ రోడ్‌లో బెస్ట్‌ప్రైజ్ సమీపంలో నూతనంగా నిర్మించిన కిమ్స్ శిఖర హాస్పిటల్స్‌ను బుధవారం ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో 200 పడకల సామర్థ్యంతో ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మించారు. తల్లీ బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన కిమ్స్ కడిల్స్ సెంటర్‌నూ ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.