Share News

CM Chandrababu: వాట్సాప్‌ ద్వారా త్వరలో 500 సేవలు

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:37 AM

వాట్సాప్‌ సేవల్లో ఎదురయ్యే సమస్యలపై స్పందించేందుకు వీలుగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

CM Chandrababu: వాట్సాప్‌ ద్వారా త్వరలో 500 సేవలు

  • ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

  • సమస్యలపై పరిష్కారానికి వాట్సాప్‌ గవర్నెన్స్‌ సెల్‌

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా త్వరలో 500 సేవలను అందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సోమవారం సచివాలయంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీపై ఆయన సమీక్షించారు. వాట్సాప్‌ సేవల్లో ఎదురయ్యే సమస్యలపై స్పందించేందుకు వీలుగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వాట్సాప్‌ సేవల్లో భాగంగా రైతు బజార్లు, నిత్యావసర షాపుల వద్ద కూడా ఆ క్యూఆర్‌ కోడ్‌ను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచంలో తొలిసారిగా 161 సేవలను వాట్సాప్‌ ద్వారా అందిస్తున్నామని సీఎం అన్నారు. వాట్సాప్‌ నంబర్‌ 95523 00009కు సందేశాన్ని పంపడం ద్వారా కావాల్సిన సేవలు అందుకోవచ్చని సీఎం వెల్లడించారు. విద్యుత్తు, హాల్‌ టికెట్లు వంటి సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని సీఎం వెల్లడించారు.

Updated Date - Feb 25 , 2025 | 03:39 AM