Share News

CM Chandrababu: ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు

ABN , Publish Date - Jun 21 , 2025 | 04:23 AM

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు...

CM Chandrababu: ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు

  • సీఎం, లోకేశ్‌ జన్మదిన శుభాకాంక్షలు

అమరావతి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ అగ్రశ్రేణి దినపత్రిక ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఏబీఎన్‌ చానల్‌ వ్యవస్థాపకుడు వేమూరి రాధాకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. తనదైన శైలిలో జర్నలిజంలో రాణించడమే కాకుండా ఎన్నో రాజకీయ, సామాజిక అంశాల్లో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పే ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయురారోగ్యాలతోపాటు తన నికార్సయిన జర్నలిజంతో మరింత సామాజిక సేవ చేసే భాగ్యాన్ని ఆ దేవదేవుడు ఆయనకు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో స్పందిస్తూ ప్రజల పక్షాన నిలిచే దమ్ము, వాస్తవాలను చూపించే ధైర్యం, నిజాలను నిర్భీతిగా ప్రసారం చేసే వేమూరి రాధాకృష్ణకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆర్కే ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్‌డే సార్‌ అని పేర్కొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 06:34 AM