Share News

Kuppam: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

ABN , Publish Date - Jul 25 , 2025 | 05:28 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా కుప్పం ప్రజలకు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు.

Kuppam: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
AP CM Chandrababu

అమరావతి, జులై 25: తన అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జీరో పావర్టీ పీ4పై సమీక్షలో భాగంగా శుక్రవారం నాడు సచివాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా #IAmMaragadarsi క్యాప్షన్‌తో పీ4 లోగోను ఆయన ఆవిష్కరించారు.


అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. బంగారు కుటుంబాలకు సాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో పీ4 మార్గదర్శులుగా ముఖ్యమంత్రితోపాటు ఆయన కుటుంబసభ్యులు భాగస్వాములుగా మారారు. ఈ కాన్ఫరెన్స్‌కు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 08:03 PM