Conference: మహిళా సాధికారత సదస్సుపై అధికారులకు శిక్షణ
ABN , Publish Date - Sep 12 , 2025 | 01:47 AM
తిరుపతి కేంద్రంగా ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే జాతీయమహిళా సాధికరత సదస్సు విజయవంతానికి లైజన్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూచించారు.
తిరుపతి(కలెక్టరేట్), సెప్టెంబరు 11 (ఆంఽధ్రజ్యోతి): తిరుపతి కేంద్రంగా ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే జాతీయమహిళా సాధికరత సదస్సు విజయవంతానికి లైజన్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో సదస్సుకు సంబంధించి లైజన్ అధికారుల శిక్షణా కార్యక్రమానికి జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ప్రతి ప్రజాప్రతినిధికి ఒక లైజన్ అధికారి, ప్రతి రాష్ట్రానికీ ఒక నోడల్ అధికారిని కేటాయిస్తామన్నారు. జేసీ శుభం బన్సల్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల మహిళా ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలప్రతినిధులకు నగరంలోని పలు హోటల్స్‌లో బస ఏర్పాటు చేశామన్నారు. వారికి లోటుపాట్లు లేకుండా లైజన్ అధికారులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో తిరుపతి స్మార్ట్‌సిటీ జనరల్ మేనేజరు చంద్రమౌళి, అధికారులు పాల్గొన్నారు.