TC Rajan: 108వ వడిలోకి టీసీ రాజన్
ABN , Publish Date - Sep 12 , 2025 | 01:51 AM
స్వాతంత్య్ర సమరయోధుడు,పలమనేరు మాజీ ఎమ్మెల్యే, టీసీ రాజన్ 108వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు.
పలమనేరు, సెప్టెంబరు 11 ( ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్ర సమరయోధుడు,పలమనేరు మాజీ ఎమ్మెల్యే, టీసీ రాజన్ 108వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. నిస్వార్థ రాజకీయ నాయకుడిగా, నిరాడంబరుడిగా, నియోజకవర్గ అభివృద్దిపైన, జిల్లా సమస్యలపైన అసెంబ్లీలో గళం విప్పిన శాసనసభ్యుడిగా టీసీరాజన్‌కు పేరుంది. ఆయన 108వ జన్మదిన సందర్బంగా పట్టణ ప్రముఖులు,శ్రేయోభిలాషులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలను నేరుగా, సోషియల్ మీడియా వేదికగా తెలియజేశారు.