Share News

SV University Ragging: ఎస్వీయూ పీఎస్‌ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకుంటున్న విద్యార్థులు

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:56 AM

ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ర్యాగింగ్‌పై యూనివర్సిటీ అధికారులు ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు.

SV University Ragging: ఎస్వీయూ పీఎస్‌ వద్ద హైటెన్షన్..  భారీగా చేరుకుంటున్న విద్యార్థులు
SV University Ragging

తిరుపతి, నవంబర్ 6: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్దకు విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో పీఎస్‌ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ అధికారులపై విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు ఫిర్యాదు చేయనున్నారు. కాగా.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో (SV University) ర్యాగింగ్ కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో విద్యార్థులను ప్రొఫెసర్‌ విశ్వనాథ్ రెడ్డి ర్యాగింగ్‌కు ప్రోత్సహించారంటూ బాధిత విద్యార్థులు ఆరోపించారు. ఈ క్రమంలో ప్రొఫెసర్‌పై ఫిర్యాదు ఇవ్వడానికి యూనివర్సిటీ అధికారులను మూడు రోజులు ముందు విద్యార్థి సంఘాలు కలిశాయి. అయితే ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ర్యాగింగ్‌పై యూనివర్సిటీ అధికారులు ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు.


అయితే.. ఇప్పటి వరకు ర్యాగింగ్‌పై ఎలాంటి చర్యలు లేకపోగా.. తిరిగి తమపైనే కేసులు నమోదు చేయటాన్ని నిరసిస్తూ ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్దకు విద్యార్థులు, బాధిత విద్యార్థినిలు చేరుకున్నారు. యూనివర్సిటీ అధికారులపై విద్యార్థినిలు, విద్యార్థి సంఘ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.


కాగా.. ఎస్వీ యూనివర్సిటీ సైకాలజీ విభాగంలో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌‌కు గురిచేయగా.. ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు హెచ్‌వోడీ దృష్టికి తీసుకెళ్లారు. ర్యాగింగ్‌ను వ్యతిరేకించాల్సిన సదరు హెచ్‌వోడీ.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన విద్యార్థుల పట్ల అనుచితంగా మాట్లాడారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ క్రమంలో విభాగాధిపతిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ర్యాగింగ్‌ పాల్పడిన సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేయాలని బాధిత విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

అసభ్యకరంగా ట్రోలింగ్.. సీపీకి సింగర్ చిన్మయి ఫిర్యాదు

ఒంగోలులో మంత్రి లోకేష్‌కు ఘనస్వాగతం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 06 , 2025 | 12:31 PM