Share News

TDP: స్త్రీ శక్తి పథకం భారం కాదు..బాధ్యత

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:30 AM

స్త్రీ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం భారంగా కాకుండా, బాధ్యతగా భావిస్తోందని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు.

TDP: స్త్రీ శక్తి పథకం భారం కాదు..బాధ్యత
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాని - సభకు అశేష సంఖ్యలో హాజరైన మహిళలు

చంద్రగిరి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): స్త్రీ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం భారంగా కాకుండా, బాధ్యతగా భావిస్తోందని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. శనివారం చంద్రగిరిలో స్త్రీ శక్తి విజయోత్సవ సభ జరిగింది. ముందుగా నాగాలమ్మ ఆలయం నుంచి అధిక సంఖ్యలో మహిళలతో పులివర్తి నాని, ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డిలు ర్యాలీగా కొత్తపేటలోని మార్కెట్‌ ఆవరణకు చేరుకున్నారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ హామీలన్నింటినీ నెరవేర్చిందన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను కూడా చేపడుతోందన్నారు. నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. జిల్లాలో పలు పరిశ్రమలు వస్తున్నాయని, అందులో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అన్నారు. వైసీపీ హయాంలో రాక్షస పాలన సాగించి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందన్నారు. తుడా చైర్మన్‌ డాలర్స్‌ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూపర్‌ సిక్స్‌ పథకాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సుధారెడ్డి మాట్లాడుతూ వైసీపీ నియోజకవర్గ పునర్విభజన పేరుతో టీడీపీలో గ్రూప్‌ రాజకీయాలకు తెరలేపిందని, అలాంటి మాటలు నమ్మవద్దని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలనలో సుధారెడ్డి ధైర్య సాహసాలతో పోరాడారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు గాలి పుష్పలత, టీడీపీ నాయకులు ఈశ్వరరెడ్డి, బడి సుధాయాదవ్‌, ముడిపల్లి సురే్‌షరెడ్డి, బాలకృష్ణమూర్తి, గౌస్‌బాషా, మునిశేఖర్‌, కేశవులునాయుడు, బెల్లంకొండ మురళి, గిరిధర్‌రెడ్డి, తిరుమలరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 01:30 AM