Share News

Elephant: పంటలపై ఒంటరి ఏనుగు దాడి

ABN , Publish Date - Aug 21 , 2025 | 01:09 AM

చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ నగరి సిరిగలవారిపల్లె గ్రామ పరిసరాల్లో ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేస్తున్నది.

Elephant: పంటలపై ఒంటరి ఏనుగు దాడి
అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు

భాకరాపేట, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ నగరి సిరిగలవారిపల్లె గ్రామ పరిసరాల్లో ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేస్తున్నది. మంగళవారం రాత్రి గుడ్లూరు బండ ప్రాంతంలో సంచరిస్తూ సిరిగలవారిపలెలో పి.సుధాకర్‌కు చెందిన వరి, మిరప పంటలు, వై.మురళికి చెందిన టమోటా, వరి పంటలను ధ్వంసం చేసింది. అటవీ సరిహద్దు ప్రాంతంలో రైతులు పంట పొలాల దగ్గరకు వెళ్లడానికి భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఒంటరి ఏనుగును తలకోన అడవిలోకి మళ్లించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Aug 21 , 2025 | 01:09 AM